Saturday, November 2, 2024

దళితబంధుకు ఢోకా లేదు

- Advertisement -
- Advertisement -

Minister KTR Participating in Q & A with Students

సంగారెడ్డి జిల్లా రుద్రారంలోని
గీతం డీమ్డ్ వర్శిటీ విద్యార్థులతో
ముఖాముఖిలో మంత్రి కెటిఆర్
సిఎం కెసిఆర్ మాటంటే మాటే
ఎట్టిపరిస్థితుల్లోనూ అమలు చేసి తీరుతాం

మన తెలంగాణ/అమీన్‌పూర్: ఎన్ని అవరోధాలు ఎదురైన దళితబంధు అమలు చేసితీరుతామని తెలంగాణ మున్సిప ల్, పట్టణాభివృద్ధ్ది, పరిశ్రమల, ఐటి మంత్రి కెటిఆర్ స్పష్టం చేశారు. సంగారెడ్డి జిల్లా ప టాన్‌చెరు మండలం రుద్రారంలోని గీతం డీ మ్డ్ విశ్వవిద్యాలయంలో కౌటిల్యా స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ విద్యార్థులతో మంగళవారం ముఖామిఖి సమావేశమయ్యారు. తెలంగాణలో జరుగతున్న అభివృద్ధిపై జరిగిన ప్ర త్యేక చర్చలో విద్యార్థులు అడిగిన పలు సందేహాలకు మంత్రి కెటిఆర్ క్షుణ్ణంగా వివరించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమది మాటల ప్రభుత్వం కాదని, చేతల్లో చే సి నిరూపించామన్నారు. గత ఏడేళ్ల టిఆర్‌ఎ స్ పాలనలో జరిగిన అభివృద్ధ్ది, కొనసాగుతు న్న అభివృద్ధ్ది పతకాలే అందుకు నిదర్శనమ ని ఆయన తెలిపారు. నీళ్ళు, నిధులు, నియామాకాల నినాదంతో ఉవ్వెత్తున ఎగసిపడ్డ ఉ ద్యమ లక్షం నెరవేరి ప్రత్యేక తెలంగాణ సా కారమయ్యే సమయంలో వచ్చిన ఎన్నో సం దేహాలను పటపంచలు చేశామన్నారు.

సీమాంధ్ర నాయకులు, ఆనాటి సమైక్యరాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమారెడ్డి సైతం తెలంగాణ రాష్ట్రంపై ఎన్నో రకాల వాఖ్యలు చేశారని, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధ్దిలో అట్టడుగుకు పోవడమేకాకుండా, విద్యుత్పత్తి లేక తెలంగాణ రాష్ట్రం చీకట్లో మునిగిపోవల్సిందేనంటూ ప్రజల్లో భయాందోళనలు కల్పించారన్నారు. వారి మాటలన్నింటినీ సవాలుగా స్వీకరించి 7780 మెగావాట్లు ఉన్న విద్యుత్పత్తిని 16 వేల మెగావాట్లకు పెంచి రా ష్ట్ర ప్రజలకు 24గంటల పాటు విద్యుత్‌ను అందించామన్నారు. తాగునీటి కోసం ట్యాంకర్ల చుట్టూ తిరిగిన దశ నుండి మిషన్ భగీరథ పథకంతో ప్రతి ఇంటికి నీరందించామన్నారు. అందుకు 45 వేల కోట్ల రూపాయలు వెచ్చించి పద్నాలుగు లక్షల కిలోమీటర్ల పైపులైన్లు వేయడం అసాధారణ విషయమన్నాని ఆయన తెలిపారు.

అంతేకాకుండా మిషన్ కాకతీయ వల్ల రాష్ట్రవాప్తంగా దాదాపు 40వేల చెరువులు నీటితో కళకళలాడుతున్నాయన్నారు. రైతుబంధుతో రైతులకు ఆపన్న హస్తం అందిస్తూ నేరుగా రైతుల ఖాతాల్లోకి డబ్బులు వేస్తూ వారికి భరోసా కల్పింస్తున్నామని, దీంతో రైతు ఆత్మహత్యలు గణనీయంగా తగ్గాయని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో దారిద్య్ర రేఖకు దిగువన ఏ ఒక్కరూ ఉండకూడదనే లక్షంతో శ్రమిస్తూ ముందుకు సాగుతున్నామని, తరతరాలుగా వెనుకబాటు తనాన్ని రూపుమాపే లక్షంతో సిఎం కెసిఆర్ దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. 1.39 లక్షల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీచేశామని, టిఎస్‌ఐ పాస్ ద్వారా రూ.2.2లక్షల కోట్ల ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించి 15 రోజుల్లోనే పరిశ్రమను నెలకొల్పేలా తగిన అనుమతులు ఇస్తున్నామని మంత్రి కెటిఆర్ తెలిపారు.

దీంతో స్థానికులకు 75 శాతం ఉద్యోగావకాశాలు కలుగుతున్నాయన్నారు. జోనల్ వ్యవస్థను కేంద్రం ఆమోదించడంతో 95 శాతం ప్రభుత్వ ఉద్యోగాలు స్థానికులకే దక్కనున్నాయని ఆయన స్పష్టం చేశారు. ఆయా ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలపై ఆధ్యయనం జరిపి మంచి, చెడులపై నివేదికలు సమర్పించాలని కౌటిల్య స్కూల్ విద్యార్థులకు మంత్రి కెటిఆర్ సూచించారు. వైఫల్యాలకు వెరవకుండా నిబద్ధతతో పనిచేసి లక్ష సాధన దిశగా పయనిస్తే విజయాలు సొంతం అవుతాయని ఆయన అన్నారు. గీతం అధ్యక్షులు శ్రీ భరత్ సమక్షంలో కొనసాగిన ఈ కార్యక్రమంలో గీతం వైస్ చాన్స్‌లర్ ప్రొ ఎన్ శివప్రసాద్, రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్‌ఆర్ వర్మ, కౌటిల్య డీన్ సయ్యద్ అక్బరుద్దీన్, సీఎంఓ మనికా రైక్వార్ తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News