Thursday, December 26, 2024

తమిళనాడు ఆటో డ్రైవర్‌పై ప్రశంసలు కురిపించిన కెటిఆర్

- Advertisement -
- Advertisement -

Minister KTR praises Tamil Nadu auto driver

హైదరాబాద్:  తమిళనాడుకు చెందిన ఆటో డ్రైవర్ అన్నాదురైపై తెలంగాణ రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ ట్విట్టర్ ద్వారా ప్రశంసలు కురిపించారు. ఆటోను ప్రపంచస్థాయి సదుపాయాలతో తీర్చిదిద్దాడని కితాబునిచ్చారు. ఫస్ట్ క్లాస్ క్యాబిన్‌లా తన ఆటోను తయారు చేశాడని ప్రశంసించారు. ఇదొక గొప్ప వినూత్న ఆలోచన అని అభివర్ణించారు. అన్నాదురై గత 10 ఏళ్లుగా చెన్నైలో ఆటో నడుపుతున్నాడు. తన ఆటోలో ఫ్రీవైఫై, స్నాక్స్, కూల్‌డ్రింక్స్ ఉన్న ఫ్రిడ్జ్, లాప్‌టాప్, ఐపాడ్ వంటివి ఏర్పాటు చేశాడు. ఈ సందర్భంగా అన్నాదురై మాట్లాడుతూ, కస్టమర్లే తనకు ప్రధానమని.. డబ్బు కంటే తనకు కస్టమర్ల సంతోషమే ముఖ్యమని చెప్పారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను మంత్రి కెటిఆర్ తన ట్విట్టర్‌లో పొందుపర్చారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News