పదేళ్ల ముందుచూపుతో హైదరాబాద్ అభివృద్ధి
నగరానికి ఏడేళ్లలో అనేక మౌలిక వసతులు
కల్పించాం విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు
అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం వచ్చే 10 ఏళ్ల
అవసరాలకు తగ్గట్టు మురుగునీటి శుద్ధి ప్లాంట్ల
నిర్మాణానికి రూ. 3,866.21 కోట్లు
కేటాయించాం శివారు ప్రాంతాల్లో
మురుగునీటి శుద్ధి కోసం అదనంగా రూ.1200
కోట్ల నిధులు ఇస్తున్నాం కంటోన్మెంట్
బోర్డును జీహెచ్‌ఎంసీలో విలీనం చేయాలన్నది
మెజార్టీ ప్రజల డిమాండ్ సిఎం కెసిఆర్‌తో
పాటు స్థానిక ఎంఎల్‌ఎ, బోర్డు మెంబర్లతో
చర్చించి దీనిపై ప్రకటిస్తాం :
హెచ్‌ఆర్‌డిలో మీడియాతో మంత్రి కెటిఆర్
రూ. 5వేల కోట్లతో మురుగునీటి శుద్ధి ప్లాంట్లు
మురుగునీటి సమస్యకు ఏ ప్రభుత్వమూ ఒకేరోజు రూ.5వేల కోట్లను విడుదల చేయలేదు
కంటోన్మెంట్ బోర్డును జిహెచ్‌ఎంసిలో విలీనం చేయాలన్నది మెజార్టీ ప్రజల డిమాండ్
హైదరాబాద్: మన హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా మార్చేందుకు ఏడు సంవత్సరాలుగా అనేక మౌలిక వసతులను కల్పిస్తున్నామని రాష్ట్ర ఐ టి, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ తెలిపారు. రాబోయే పదేళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని సూయరేజీ ప్లాంట్లను హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్నామని, దీనికి కేబినెట్ ఆమోదం తెలిపిందని ఆయన పేర్కొన్నారు. సూయరేజీ ప్లాంట్ల నిర్మాణానికి రూ. 3,866.21 కోట్లు కేబినెట్ కేటాయించిందని కెటిఆర్ స్ప ష్టం చేశారు. దీనికి సంబంధించిన జిఒను గురువారం ప్రభుత్వం విడుదల చేసిందని ఆయన తెలిపారు. దీనికి సంబంధించి వివరాలను ఎంసిఆర్‌హెచ్‌ఆర్‌డి జరిగిన విలేకరుల సమావేశంలో మంత్రి కెటిఆర్ వివరించారు. హైదరాబాద్ విశ్వనగరంగా ఎదగాలంటే మౌలిక వసతులు ఉండాలని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. దానికి అనుగుణంగా ఏడు సంవత్సరాలుగా జిహెచ్‌ఎంసి, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా అనేక కార్యక్రమాలు చేపట్టిందన్నారు. ఇప్పటికే మహానగరంలో తాగునీటికి సమస్య లేకుం డా చేశామని, 90 శాతం తాగునీటి సమస్యకు పరిష్కారం ల భించిందన్నారు. విద్యుత్ సరఫరా విషయంలో కూడా సమస్యల్లేవన్నారు. హైదరాబాద్‌లో మంచినీటి, విద్యుత్ సమస్యలు రా కుండా పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టామన్నారు. అందులో భాగంగానే పరిశ్రమలతో పాటు అన్ని వర్గాలకు 24 గంటల నా ణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేస్తున్నామన్నారు. జలమండలి సమర్థవంతమైన పనితీరు వలన నగరానికి వాటర్ ప్లస్ సిటీ హో దా దక్కిందన్నారు.
మూసీ ప్రక్షాళన, చెరువుల పునరుద్ధరణ
గురించి సిఎం దృష్టికి..
హెచ్‌ఎండిఏ పరిధిలో రోజుకు 1950 ఎంఎల్‌డిల మురికినీరు, జీహెచ్‌ఎంసి పరిధిలో 1650 ఎంఎల్‌డిల మురికి నీరు ఉత్పత్తి అవుతోందని మురుగు నీటి శుద్ధి కోసం ఎస్టీపీల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని, ఇది హైదరాబాద్ ప్రజలకు శుభవార్త అని మంత్రి కెటిఆర్ తెలిపారు. ప్రస్తుతం జీహెచ్‌ఎంసీలో ఉత్పత్తి అవుతున్న 1650 ఎంఎల్‌డిల మురుగులో 46.8 శాతం మాత్రమే (772) ఎంఎల్‌డిలు మాత్రమే శుద్ధి అవుతుందన్నారు. మూసీ ప్రక్షాళన, చెరువుల పునరుద్ధరణ గురించి సిఎం కెసిఆర్ దృష్టికి చాలాసార్లు తీసుకెళ్లామన్నారు. కేబినెట్ సమావేశంలోనూ ఈ అంశంపై విస్తృత చర్చ జరిగిందన్నారు. రాబోయే పదేళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని సివరేజీ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రస్తుతం జీహెచ్‌ఎంసి పరిధిలో ఉన్న 772 ఎంఎల్‌డిల సివరేజీ ప్లాంట్‌లకు అదనంగా 1260 ఎంఎల్‌డిల సివరేజీ ప్లాంట్ల ఏర్పాటుకు కేబినెట్ అనుమతి ఇచ్చిందన్నారు. షా కన్సల్టెన్సీ నివేదిక ఆధారంగా రాబోయే పదేళ్ల పాటు అదనంగా ఉత్పత్తి అయ్యే మురుగునీటిని శుద్ధి చేసేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందన్నారు. 15 ఏళ్ల పాటు వాటి నిర్వహణ కూడా నిర్మాణదారులదేనని ఆయన పేర్కొన్నారు. రెండేళ్లలో పనులు పూర్తి చేసి వందశాతం మురుగునీటిని శుద్ధి చేసే ఏకైక నగరంగా హైదరాబాద్ నిలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
31 ప్రాంతాల్లో ఈ సివరేజీ ప్లాంట్‌లు
31 ప్రాంతాల్లో ఈ సివరేజీ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి తెలిపారు. దీనికోసం రూ. 3,866.21 కోట్లు కేబినెట్ కేటాయించిందన్నారు. దీంతోపాటు శివారు ప్రాంతాల్లోనూ ఈ మురుగునీటి శుద్ధి కోసం, తాగునీటి సౌకర్యం కోసం అదనంగా రూ.1200 కోట్ల నిధులను ముఖ్యమంత్రి ఇస్తున్నారన్నారు. నగరంలో చెరువులు, కాలువల శుద్ధికి కార్యాచరణ రూపొందిస్తున్నట్టు ఆయన తెలిపారు. హైదరాబాద్ ప్రజల తరపున సిఎం కెసిఆర్‌కు హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నామని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. నగరంలో సాగునీటి వనరులను పరిశుభ్రం చేయాలంటే ప్రస్తుతం ఉత్పత్తి అవుతున్న మురుగునీటిని 100 శాతం పరిశుభ్రం చేయాల్సిన అవసరం ఉందన్నారు. మొత్తంగా హైదరాబాద్ తో పాటు పరిసర ప్రాంతాల్లోని మురుగు నీటి సమస్య నివారణ కోసం ఒకేరోజు రాష్ట్ర ప్రభుత్వం 5000 కోట్ల రూపాయల నిధులను ప్రకటించిందని, చరిత్రలో ఎన్నడూ, ఏ ప్రభుత్వం నగరానికి భారీ ఎత్తున నిధులు ఇవ్వలేదన్నారు.
రెండు లక్షల కొత్త మంచినీటి కనెక్షన్లు
శుద్ధి చేసిన మురుగునీటిని ప్రస్తుతం కేవలం 20 శాతం వరకు మాత్రమే మనం వినియోగిస్తున్నామని, రానున్న రోజుల్లో ఎక్కువ శాతం వినియోగించేలా కాలుష్య ని యంత్రణ మండలి, పరిశ్రమల శాఖతో చర్చించి కార్యాచరణ చేపడతామని మంత్రి తెలిపారు. అన్ని మున్సిపాలిటీలు, పంచాయతీలకు తాగునీటి సౌకర్యం కోసం రూ.1200 కోట్లతో అదనపు పనులకు కూడా ఆమోదం తెలిపినట్టు ఆయన తెలిపారు. 137 ఎంఎల్‌డిల సామర్థంతో రిజర్వాయర్లు, 2100 కిలోమీటర్ల మేర పైపులైన్లు వేసి రెండు లక్షల కొత్త మంచినీటి కనెక్షన్లు ఇస్తామని మంత్రి కెటిఆర్ తెలిపారు. వరదల సమయంలో తీవ్ర ఇబ్బందులు ఎదురైన ప్రాంతాల్లో ఎస్‌ఎన్‌డిపి పనులను మొదటగా ప్రారంభించినట్టు మంత్రి తెలిపారు.
కబ్జాలను తొలగించాల్సిన అవసరం ఉంది
నాలాలపై వేల సంఖ్యలో ఉన్న కబ్జాలను తొలగించాల్సిన అవసరం ఉందని మంత్రి కెటిఆర్ అభిప్రాయపడ్డారు. నాలాలపై కబ్జా ఉన్న వారిని ఇప్పటికే సిద్ధంగా ఉన్న రెండు పడకల గదుల ఇళ్లలోకి తరలించి వెంటనే రిటైనింగ్ వాల్ నిర్మాణం చేపట్టాలన్న ఆలోచనలో ఉన్నామని, ఈ విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు.
కబ్జాలు తొలగించేలా ప్రత్యేక చట్టం
అందుకోసం జీహెచ్‌ఎంసి చట్టంలో ఉన్న నిబంధనలు ఉపయోగించి కబ్జాలు తొలగిస్తామని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. కబ్జాలు తొలగించేలా అవసరమైతే కొంత కాలానికి ప్రత్యేక చట్టం తీసుకొచ్చే యోచనలో ఉన్నట్లు మంత్రి తెలిపారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటామని నగర ఎంపిలు, ఎమ్మెల్యేలతో త్వరలో సమావేశం ఏర్పాటు చేస్తామని మంత్రి చెప్పారు. ప్రణాళిక మేరకు నాలాల విస్తరణ చేపడతామని, వర్షాకాలం తర్వాత నాలాల విషయమై పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తామని మంత్రి స్పష్టం చేశారు. నాలాల విస్తరణకు ప్రజలు, ప్రజాప్రతినిధులు పూర్తి స్థాయిలో సహకరించాలని ఆయన కోరారు.
కెటిఆర్ ట్వీట్‌కు 70శాతం అనుకూలంగా స్సందన
కంటోన్మెంట్ విలీన అంశంపై మంత్రి కెటిఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మెజార్టీ ప్రజలు కంటోన్మెంట్‌ను జీహెచ్‌ఎంసిలో విలీనం చేయాలని కోరుకుంటున్నారని ఆయ న తెలిపారు. బుధవారం సోషల్ మీడియా వేదికగా ఈ అంశంపై కెటిఆర్ చేసిన ట్వీట్‌కు మంచి స్పందన రాగా, 70 శాతం పైచిలుకు ప్రజలు కలిపితేనే బాగుంటుందని తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా కంటోన్మెంట్ విలీన అంశంపై ఓ జర్నలిస్టు అడిగిన ప్ర శ్నకు మంత్రి కెటిఆర్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్ర ప్రభుత్వ అజమాయిషీలో లేదు..
కంటోన్మెంట్ ఏరియా రాష్ట్ర ప్రభుత్వ అజమాయిషీలో లేదన్నారు. కంటోన్మెంట్ అధికారులతో సమస్య ప్రభుత్వానిదే కాదనీ ప్రజలకు కూడా ఉందన్నారు. అధికారులు అక్కడ రోడ్లు మూసివేస్తారని, ఇష్టానుసారంగా వ్యవహారిస్తున్నారన్నారు. హైదరాబాద్ పెరగనప్పుడు సమస్య తీవ్రత వేరని, ఇప్పుడు కంటోన్మెంట్ చుట్టూ లక్షల మంది జనాలు ఉన్నారన్నారు. టిఎస్ బిపాస్, అన్నపూర్ణ సెంటర్లు అక్కడ అమలు కావడం లేదన్నారు. నగరమంతా ఫ్లై ఓవర్లు, స్కైవేలు కడుతున్నామని, ఆ ప్రా ంతంలో కడుదామంటే అడ్డంకులు వస్తున్నాయన్నారు. ఏడేళ్ల నుంచి ప్రయత్నం చేస్తున్నాం, కానీ సమస్య పరిష్కారం కావడం లేదన్నారు. ఈ అంశాన్ని రాష్ట్ర ప్రభు త్వం ప్రస్తావిస్తే కంటోన్మెంట్ అధికారులు సహకరించరని ముందుకు రారని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు.
కంటోన్మెంట్ విలీనానికే మెజార్టీ ప్రజలు మొగ్గు
కంటోన్మెంట్ ల్యాండ్‌కు సమానమైన ల్యాండ్ ఇస్తామని చెప్పినా కంటోన్మెంట్ అధికారులు ఒప్పుకోవడం లేదన్నారు. ఇది విచిత్రమైన పరిస్థితి అని ఆయన తెలిపారు. ఒకటి రెండు కాదు 40 రోడ్లు మూసివేశారని, కంటోన్మెంట్ విలీన అంశంపై ఒకటి, రెండు పేపర్లలో ప్రజాభిప్రాయ సేకరణకు సంబంధించి వార్తలు వచ్చాయని, కంటోన్మెంట్ బోర్డును జీహెచ్‌ఎంసీలో విలీనం చేస్తేనే మంచిదని మెజార్టీ ప్రజలు అభిప్రాయ పడినట్లు ఆ వార్తా కథనాల్లో పేర్కొన్నారని మంత్రి తెలిపారు. దీనిపై ప్రజలు నిజంగా ఏమనుకుంటున్నారో తెలుసుకునేందుకు తాను సోషల్ మీడియా ద్వారా వారి అభిప్రాయాలను కోరానన్నారు. కంటోన్మెంట్‌లో జీహెచ్‌ఎంసీలో కలిపితేనే బాగుంటుందని 70 శాతం పైచిలుకు ప్రజలు తమ అభిప్రాయాలను వెల్లడించారని ఈ అంశాన్ని సిఎం కెసిఆర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు.
ప్రజాభిప్రాయం స్పష్టంగా ఉంది..
ఎన్నికలు ఉన్నప్పుడే ఇలాంటివి గుర్తు వస్తాయని ఓ పత్రిక రాసిందని, తమకు ఎన్నికలప్పుడే కార్యక్రమాలు చేసే అలవాటు లేదని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికలు లేనప్పటికీ ఇవాళ ఐదు వేల కోట్లను విడుదల చేశామన్నారు. ఎన్నికలతో పని లేకుండా పని చేసుకోని పోవడమే మా సిస్టమన్నారు. ప్రజాభిప్రాయం స్పష్టంగా ఉందని, మెజార్టీ ప్రజాభిప్రాయం విలీనానికి అనుగుణంగా ఉందన్నారు. దీనిపై సిఎం కెసిఆర్‌తో పాటు స్థానిక ఎమ్మెల్యే, బోర్డు మెంబర్లతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి కెటిఆర్ స్పష్టం చేశారు.