Wednesday, January 22, 2025

అభ్యర్థులెవరూ మళ్లీ ఫీజు కట్టాల్సిన పనిలేదు: మంత్రి కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: టీఎస్‌పీఎస్‌సి పేపర్ లీకేజీపై ముఖ్యమంత్రి కెసిఆర్ తో సమీక్షించామని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. తెలంగాణ పబ్లిక్ కమిషన్ భారతదేశంలోనే అత్యుత్తమైనదన్నారు. గతంలో ఉమ్మడిగా ఎపిపిఎస్సీపై ఆరోపణలు వచ్చేవని మంత్రి తెలిపారు. కమిషన్ లోనే పనిచేసే ఇద్దరు చేసిన తప్పు… వ్యవస్థకే చెడ్డపేరు తెచ్చింది. ప్రీవణ్, రాజశేఖర్ రెడ్డి ఇద్దరే కాదు… ఇంకా ఎవరున్నా కఠిన చర్యలు తప్పవన్నారు. ఇలాంటి వ్యక్తుల పొరపాటు వచ్చిన తప్పిదాలు మరోసారి రాకుండా చూస్తామని మంత్రి పేర్కొన్నారు.

గతంలో ఫీజు చెల్లించినందు వల్ల అభ్యర్థులెవరూ మళ్లీ కట్టాల్సిన పనిలేదన్నారు. సాధ్యమైనంత వేగంగా పీరక్షలు నిర్వహిస్తాం. గతంలో అప్లయ్ చేసినవాళ్లంగా అర్హులేనని మంత్రి కెటిఆర్ వివరించారు. 4 పరీక్షలకు సంబంధించిన కోచింగ్ మెటీరియల్ ఆన్ లైన్ లో పెడతామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్టడీ సర్కిళ్లను మరింత బలోపేతం చేస్తామని మంత్రి వెల్లడించారు. రీడింగ్ రూమ్ లో 24 గంటలు తెరిచే ఉంటాయన్నారు. మెటీరియల్ అందించడంతో పాటు బోజన వసతి కూడా కల్పిస్తా

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News