Monday, December 23, 2024

అనుమానం రాకూడదనే పరీక్షలు రద్దు చేశాం: మంత్రి కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నిరుద్యోగ యువత ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని రాష్ట్ర పురపాలక శాఖ, ఐటీ శాఖల మంత్రి కెటిఆర్ అన్నారు. వ్యవస్థ పటిష్టంగా ఉంది.. ఇద్దరు వ్యక్తులు చేసిన తప్పు మాత్రమేనని మంత్రి వివరించారు. రాజకీయ నిరుద్యోగులు చేసే వ్యాఖ్యానాలను పట్టించుకోవద్దని కెటిఆర్ సూచించారు. సున్నిత మనస్కులైన పిల్లలను ఇబ్బంది పెట్టవద్దని కోరారు. పరీక్ష రాసినవాల్లు మళ్లీ రాయాలని బాధపడుతున్నారు. అనుమానం రాకూడదనే పరీక్షలు రద్దు చేశామని మంత్రి కెటిఆర్ వెల్లడించారు. క్వాలిఫై అయినవాళ్లు పెద్దమనుస్సుతో అర్థం చేసుకోవాలని ఆయన తెలిపారు. అపోహలు, అనుమానాలు, దుష్రృచారాలు నమ్మవద్దని సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News