బిక్కనూర్: కామారెడ్డి నియోజకవర్గంలోని బిక్నూర్, రాజంపేట మండలాల బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్ హాజరయ్యారు. అనంతరం అక్కడ నిర్వహించిన బహిరంగ సభలో మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ… కామారెడ్డి నియోజకవర్గం గురించి రాష్ట్రం మొత్తం చర్చ జరుగుతోంది. కెసిఆర్ ఎందుకు కామారెడ్డిలో పోటీ చేస్తున్నారని చర్చ జరుగుతుందని మంత్రి వెల్లడించారు.
కామారెడ్డి రైతలు కల నెరవేర్చడానికి కెసిఆర్ పోటీ చేస్తున్నారని మంత్రి వివరించారు. ఈ నెల 9న కెసిఆర్ నామినేషన్ వేయబోతున్నారు. నామినేషన్ రోజు వచ్చే ప్రజలను చూసి ఇతర పార్టీల వాళ్లు పోటీకే భయపడాలని ఆయన తెలిపారు. బిజెపి ఇచ్చే చాక్లెట్లకు ఆశ పడోద్దు.. బిఆర్ఎస్ ఇచ్చే బిర్యానీ తినండం అని మంత్రి పేర్కొన్నారు. ఇతర పార్టీలు డబ్బులు ఇస్తే తీసుకొండి.. ఓటు మాత్రం భారసకే వేయాలని సూచించారు. తప్పని పరిస్థితుల్లో కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందని కెటిఆర్ వెల్లడించారు.