Friday, December 20, 2024

బరాబర్.. మాది ‘కుటుంబ’ పాలనే

- Advertisement -
- Advertisement -

తెలంగాణలో కెసిఆర్‌ది కుటుంబ పాలన అంటూ విపక్షాలు చేస్తున్న విమర్శలపై మంత్రి కెటిఆర్ ఘాటుగా స్పందించారు. 4కోట్ల మంది రాష్ట్ర ప్రజలు కెసిఆర్ కుటుంబ సభ్యులేనని స్పష్టం చేశారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు ఉభయసభల్లో ఆయన స మాధానమిచ్చారు. ఎనిమిదేళ్ల తెలంగాణ సాధించిన ప్రగతిని వివరిస్తూనే ప్రతిపక్షాలపై నిప్పులు చె రిగారు. కేంద్రంపైన, మోడీ సర్కార్‌పైన విమర్శనాస్త్రాలు సంధించారు. ప్రస్తుత జాతీయ రాజ కీయాల్లో బిఆర్‌ఎస్ అవశ్యకతను వివరించారు.

మనతెలంగాణ/హైదరాబాద్ : ష్ట్రంలో బిఆర్‌ఎస్‌ది వందశాతం కుటుంబ పాలనే.. నాలుగు కోట్ల మంది కేసిఆర్ కుటుబం సభ్యులే.. అందరికీ కుటుంద పెద్ద కెసిఆర్ అని ఐటి పురపాలక శాఖల మంత్రి కెటిఆర్ వెల్లడించారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ మంత్రి కెటిఆర్ అసెంబ్లీ, శాసనమండలిలో వేర్వేరుగా సుదీర్గమైన ప్రసంగాలు చేశారు. ప్రతిపక్ష పార్టీలు చేసిన విమర్శలపై మంత్రి కేటిఆర్ చెలరేగి పోయారు. రాష్ట్రంలో బిఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు, జాతీయ అంతర్జాతీయ స్థాయిలో అవి రోల్‌మోడల్‌గా నిలిచిన తీరు, ప్రధాని మోడి నేతృత్వంతో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్న తీరు, రాష్ట్రం పట్ల మోడీ సర్కారు కక్షపూరిత ధోరణి తదితర అంశాలను తన ప్రసంగంలో ఎండగడుతూ ప్రతిపక్ష సభ్యల విమర్శలకు ధీటైన బదులిచ్చారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారి సారథ్యంలోని తెలంగాణ రాష్ట్ర రెండో ప్రభుత్వంలో ఆఖరి బడ్జెట్ సందర్భంగా..

గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే అవకాశం రావడాన్ని అదృష్టంగా భావిస్తున్నాను అంటూ ప్రారంభించిన కెటిఆర్ ప్రసంగం ఆయన మాటల్లోనే… ఎనిమిదన్నరేండ్ల తెలంగాణ స్వయం సుపరిపాలనను, దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ ప్రగతి ప్రస్థానాన్ని ఈ సందర్భంగా చర్చించుకోవడానికి.. స్వరాష్ట్రంగా తెలంగాణ అత్యున్నత శిఖరాలను అధిరోహించడానికి సిఎం కేసీఆర్ ప్రభుత్వం జరిపిన కృషిని, తెలంగాణలోని సబ్బండ వర్గాలు అందించిన సహకారాన్ని రాష్ట్రం ముందు ఉంచేందుకు నాకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నాను. ఇంతే కాదు గవర్నర్ గారికి ధన్యవాదాలు తెలపడం అంటే, ఇంతటి అభివృద్ధికి కారణమైన తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుకోవడమే తప్ప మరోటి కాదు. తెలంగాణ ఈ స్థాయికి ఎదిగడానికి, ఇంతటి ఘనతకు కారణమైన నాటి తెలంగాణ ఉద్యమాన్ని.. అనంతర కాలంలో తెలంగాణ ప్రగతిలో భాగస్వామ్యమైన ప్రతి ఒక్క వర్గాన్ని, వారి కృషిని గుర్తుచేసుకోవడాన్ని కర్తవ్యంగా భావిస్తున్నాను.

పదేళ్లు కూడా దాటని పసిబిడ్డ తెలంగాణ ఇవాళ యావత్ దేశానికే దారిచూపే దీపస్తంభంగా మారింది. నాటి తెలంగాణ.. ఉద్యమ శాస్త్రానికి టీచింగ్ పా యింట్ అయితే నేటి సముజ్వల తెలంగాణ… ఉత్తమ పాలనలో దేశానికే టీచింగ్ పాయింట్ – టాకింగ్ పాయింట్. గవర్నర్‌కు ధన్యవాదాలు చెప్పే ఈ తీర్మానంలో.. 9 ఏళ్ల ఉజ్వల తెలంగాణ ప్రగతి ప్రస్థానంలో భాగస్వాములైన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ప్రభుత్వ సంకల్పాన్ని… పరిపాలనా సంస్కరణలను సమర్థవంతంగా అమలుచేసి సంక్షేమాన్ని ప్రతి గడపకు, అభివృద్ధిని ప్రతీ పల్లెకు చేర్చిన మా ప్రభుత్వ ఉద్యోగులందరికీ సలాం.. తెలంగాణ అన్ని రంగాల లో అగ్రగామిగా నిలిచి సబ్బండవర్ణాల సంక్షేమం ధ్యేయంగా, మానవీయ పాలనతో ప్రగతి పథంలో దూసుకుపోతున్నది. పరిపాలకుడే రైతు బిడ్డ అయితే స్వయంగా రైతు అయితే సంక్షోభంలో చిక్కుకున్న సాగు సంబురంగా మారుతుందన్న సత్యం మన కళ్ళ ముందట ఆవిష్కృతమైంది.

ఎఫ్‌సీఐకి అత్యధికంగా ధాన్యం సమకూరుస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణది నెంబర్ టూ ప్లేస్..! పంజాబ్‌తో పోటీపడుతున్న రాష్ట్రం..! గత మూడేండ్లలో వరసగా కోటి టన్నుల పైగా ధాన్యాన్ని ఎఫ్ సీ ఐకి ఇచ్చినం! .2019–20 కోటి 11 లక్షల టన్నులు,2020–21 కోటి 40 లక్షల టన్నులు,2021–22 కోటి 20 లక్షల టన్నులు..ఆహార ధాన్యాల ఉత్పత్తిలో దేశంలోనే మనది మూడోస్థానం… ఇది నా లెక్కకాదు..నాబార్డ్ లెక్క.! ఆర్బీఐ వార్షిక హాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ లెక్క..ఆహార ధాన్యాల ఉత్పత్తి 2015లో 51 లక్షల టన్నులైతే..2021–22 లో కోటిన్నర టన్నులు..!కలయా నిజమా అనిపించేటంత వృద్ధి..! 194 శాతం పెరుగుదల..బియ్యం ఉత్పత్తిలో పదో స్థానం నుంచి నాలుగో స్థానానికి ఎదిగినం.. రైస్‌ప్రొడక్షన్ 2014–15లో 44.40 లక్షల టన్నులుంటే.. 2020–21 నాటికి అది కోటి 2 లక్షల టన్నులు. 2014 వానాకాలంలో వరిసాగు 22.74 లక్షల ఎకరాలైతే, 2022 వానాకాలంలో 65 లక్షల పైగా ఎకరాల్లో వరినాట్లు పడ్డాయి.

తెలంగాణ చరిత్రలోనే అత్యధికం. ఎనిమిదిన్నర ఏండ్లలో ప్రభుత్వం సేకరించిన ధాన్యం సుమారు 6 కోట్ల 70 లక్షల టన్నులు.ఆ ధాన్యం విలువ లక్షా 20వేల కోట్ల రూపాయలు..7వేల కొనుగోలు కేంద్రాలు పెట్టి రైతు దగ్గరికే వెళ్లి పంట కొంటున్న రాష్ట్రం దేశంలో తెలంగాణ కాకుండా ఇంకెక్కడైనా వుందా..! వ్యవసాయ రంగంలో విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంలో తెలంగాణ అగ్రస్థానంలో వుంది..ఇది కేంద్ర వ్యవసాయ శాఖ 2021 నివేదిక తేల్చిన వాస్తవం. 2019 అక్టోబర్ నుంచి 2021 సెప్టెంబర్ మధ్య 49.44 మిలియన్ డాలర్ల ఎఫ్‌డీఐలు వ్యవసాయ రంగంలోకి వెల్లువెత్తాయి. రైతుబంధు పథకం కింద 10 విడతలు..రైతుల ఖాతాల్లో 65వేల558 కోట్లు జమ చేశాం. ప్రపంచంలోనే వినూత్న పథకాల్లో ఒకటిగా ఐక్యరాజ్యసమితి గుర్తింపు, ప్రపంచ బ్యాంకు ప్రశంసలు. నచ్చని నేతలేడు. మెచ్చుకోని ఆర్థికవేత్త లేడు.

అశోక్ గులాటీ, అరవింద్ సుబ్రహ్మణ్యం, దేవిందర్‌శర్మ, అన్నా హజారే, రంగరాజన్, ఎన్‌కే సింగ్ తదిరత వ్యవసాయ నిపుణులు ఆర్థిక వేత్తలు ఆగ్రో ఎకనామిస్ట్‌ల ప్రశంసలు లభించాయి.. 70 శాతం నిధులు బడుగు బలహీన వర్గాల రైతుల ఖాతాల్లోనే పడుతున్నవి .రైతుబంధుకు ఇస్తున్న మొత్తం డబ్బులో బీసీ రైతులకు 48 శాతం.. ఎస్సీలకు 9 శాతం..ఎస్టీ రైతులకు 13శాతం చేరుతున్నది..5 ఎకరాల లోపు రైతులు 91.33శాతం..5-10 ఎకరాలు 7.28 శాతం,పది ఎకరాలపైన వున్న రైతులు 1.39 శాతమే..రైతుబీమా..ఇప్పటిదాకా 94,500 కుటుంబాలకు 4725 కోట్లబీమా సాయం. మొత్తం బీమాసాయంలో బీసీ రైతు కుటుంబాలు 51శాతం, ఎస్సీ 19 శాతం, ఎస్టీ 16 శాతం..మైనార్టీ 11 శాతం అందింది..

కల్యాణ లక్ష్మి

దేశ చరిత్రలో 11 లక్షల మంది ఆడబిడ్డల పెళ్లిళ్లు చేసిన పాలకుడు ఎవరైనా ఉన్నారా అధ్యక్షా. ఒక్క సీఎం కేసిఆర్ తప్ప లక్ష 16 వేల చొప్పున ఆడపిల్లకు ఆర్థిక సాయం అందిస్తూ ఎనిమిదిన్నరేళ్ల కాలంలో సుమారు 11 లక్షల 90 వేల నిరుపేద కుటుంబాలకు కల్యాణ లక్ష్మి, షాది ముబారక్ అందించాము. పదివేల కోట్ల రూపాయల ఖర్చు ..దళిత సంక్షేమం.. దేశంలో ఎక్కడా లేనివిధంగా దళిత బంధు పథకం, పది లక్షల గ్రాంట్, ఇప్పటిదాకా 38,511 మందికి దళిత బంధు, 3900 కోట్ల ఖర్చు. ప్రతి నియోజకవర్గానికి 1500 మంది అర్హులైన కుటుంబాలను గుర్తించడం ..లక్షా 61 వేల దళిత పారిశ్రామిక వేత్తలకి సుమారు 2000 కోట్ల రూపాయల సబ్సిడీ .దళితులను పారిశ్రామికవేత్తలుగా మార్చే టీఫ్రైడ్ పథకంతో 61 వేల మందికి 2 ఏడు వందల నలభై కోట్ల రూపాయల ప్రొత్సాహాకాలు. దళిత నివాసాలకు 100 ఒక యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు.. ఇప్పటివరకు 268 ఎస్సీ గురుకులాల ఏర్పాటు.. ఒక్కరికి పదవిస్తే.. ఆదివాసీ గిరిజనులందరి అభివృద్ధి జరిగినట్టు కాదు అధ్యక్షా.. ప్రతి తండాకు, ప్రతి గోండు గూడానికి పాలనా ఫలాలు అందినప్పుడే నిజమైన అభివృద్ధి.. 500కు పైగా జనాభా ఉన్న 2,471 తాండలను గూడెలను నూతన గ్రామపంచాయతీలుగా మార్చాం.

ఎస్టీ సబ్‌ప్లాన్ కింద గత ఎనిమిదిన్నర సంవత్సరాలలో దాదాపు 47 వేల కోట్ల రూపాయల ఖర్చు. గిరిజనులకు ఉన్న 6 శాతం రిజర్వేషన్ 10 శాతానికి పెంచి దేశానికి ఆదర్శంగా తెలంగాణ. గిరిజనులకే రాజకీయ పరిపాలన అధికారాన్ని టి ప్రైడ్ తో 13 వేల 200 మందికి 640 కోట్ల ప్రోత్సాహకాలు..సిఏం గిరి వికాస్ యోజన, ఎకానమిక్ సపొర్ట్ స్కీం, సియంయస్టీ వంటి వివిధ పథకాలతో లక్షా మూడు వేల మంది గిరిజన యువకులకు సుమారు 720 కోట్ల రూపాయల ప్రోత్సహాకాలు.. 101 యూనిట్ల వరకు ఎస్టీలకు ఉచిత విద్యుత్..గొల్ల కురుమ, యాదవులకు గొర్రెల పంపిణీ కార్యక్రమం.. ఇప్పటిదాకా సుమారు 3,90,000 మందికి దాదాపు 83 లక్షల గొర్రెలను అందించాం. సుమారు 5000 కోట్ల రూపాయల ఖర్చు. ప్రభుత్వ కృషి ఫలించి దాదాపు 8 వేల కోట్ల రూపాయల సంపద గొల్ల కురుమలకు. మరో 6,125 కోట్లతో మరో మూడున్నర లక్షల మందికి 73 లక్షల గొర్రెలను పంపిణీ చేసే కార్యక్రమం కొనసాగుతున్నది.

మాంసం ఉత్పత్తిలో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ గా నిలిచింది. కేంద్ర ప్రభుత్వం లెక్కల ప్రకారం 2016లో 1.35 లక్షల టన్నులు ఉంటే అది ఈరోజు 3 లక్షల టన్నులకు చేరింది. జాతీయ తలసరి సగటు వినియోగం 5.4 కేజీలు ఉంటే తెలంగాణలో 21 కేజీలకు పెరిగింది.

ముదిరాజుల, గంగపుత్రుల కోసం దాదాపు 400 కోట్ల రూపాయలతో చేపల పంపిణీ..సుమారు 7600 కోట్ల రూపాయల మత్య్స సంపద చేకూరింది.దేశం ఇన్ లాండ్ ఫిషరీస్ లో తెలంగాణ అగ్రస్థానం.. 2014లో 2.49 లక్షల టన్నుల చేప లు రొయ్యల ఉత్పత్తి ఉంటే.. నేడు అది 3.90 లక్షల టన్నులకు చేరింది. 2014లో 2,479 కోట్ల మత్స్య సంపద ఉంటే, అది ఈరోజు దాదాపు 5,900 కోట్లకు పెరిగింది. హరితహారంలో తాటి, ఈతవనాలు పెంపకం..నేతన్నకు చేయూత.. రాష్ట్రవ్యాప్తంగా డిజిటల్ హ్యాండ్లూమ్ సర్వే. 21,585 చేనేత కార్మికులు,43,104 పవర్ లూం ..నాయి బ్రాహ్మణులకు 50 శాతం సబ్సిడీ పైన రుణాలు.క్షవరశాలలకు 250 యూనిట్ల ఉచిత విద్యుత్తు పథకం. సుమారు 35,000 మందికి లబ్ధి,రజకులకు ఆధునిక లాండ్రి యంత్రాలు, ధోభీ ఘాట్ల నిర్మాణం. సుమారు 1500 కోట్ల రూపాయలు ఖర్చు..

ఇంతపెద్ద కేంద్ర బడ్జెట్ లో దేశంలోని బీసీలకు మీరిచ్చేది కేవలం 2000 కోట్లా?..50 శాతానికి పైగా జనాభా కలిగిన బీసీలకు నిధులు కూడా ఇవ్వలేని కేంద్రం…రాష్ట్రంలో 408 మైనార్టీ రెసిడెన్షియల్ విద్యాసంస్థల ఏర్పాటు.435 కోట్ల రూపాయలతో 2700 మంది మైనార్టీ విద్యార్థులకు విదేశీ విద్య.ఇమామ్, మౌజంలకు నెలకు 5000 చొప్పున గౌరవ వేతనం..క్రిష్టియన్ వేల్పేర్..అధికారికంగా క్రిస్మస్ పండుగ నిర్వహణ,క్రిస్మస్ కి బట్టలు పంపిణీ కార్యక్రమం, క్రిస్టియన్ ఆత్మ గౌరవ భవన నిర్మాణం,అగ్రవర్ణ సంక్షేమానికి సైతం కట్టుబడి ఉన్న ప్రభుత్వం మాది..వివేకానంద విదేశీ విద్యా పథకం, వేద పాఠశాలలకు ఆర్థిక సహాయం, వేద శాస్త్ర పండితులకు 2500 నెలసరి గౌరవ బృతి..దేశానికే ఆదర్శంగా తెలంగాణ మహిళా శిశు సంరక్షణ కార్యక్రమాలు..కెసిఆర్ కిట్ పథకం- 12 వేల రూపాయల ఆర్థిక సహాయం, 13 లక్షల 90 వేల మందికి ఇప్పటిదాకా లబ్ధి, సుమారు 1261 కోట్ల రూపాయల ఖర్చు.. గర్భిణీలకు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లు, అమ్మ ఒడి కార్యక్రమానికి 300 ప్రభుత్వ వాహనాలు.. గర్భినీలను సకాలంలో చెకప్,

డెలివరీలకు తీసుకు వెళ్లేందుకు మార్గం. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటిదాకా అరోగ్య లక్ష్మి ద్వారా సుమా రు 36 లక్షలు.. సమైక్యరాష్ట్రంలో ఉద్యోగులకు వెతలు ఎక్కువ, వేతనాలు తక్కువ.. కానీ..ఇవాళ వెతలు కాదు… వేతనాలు ఎక్కువ. తెలంగాణ ఇంక్రిమెంట్.. 8 ఏళ్లలో రెండుసార్లు వేతన సవరణ.. 2017లో 43శాతం, 2020లో పిఆర్సీ. తెలంగాణ ఉద్యోగులకు దేశంలోనే అత్యధికంగా జీతాలు.. మొత్తంగా తొమ్మిది లక్షల పదిహేడు వేల మందికి లబ్ది. అనేక ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్టు పద్దతిన పనిచేస్తున్న ఉద్యోగుల రెగ్యులరైజేషన్, పదవీ విరమణ వయసు 61 ఏళ్లకు పెంపు. 95శాతం అవకాశాలు స్థానికులకు దక్కేల నూతన జోనల్ వ్యవస్థ ఏర్పాటు.ఉద్యోగాల భర్తీ .. లక్ష ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి హామీ ఇస్తే, ఇప్పటికే దాదాపు లక్ష 40 వేల ఉద్యోగాల భర్తీ. మరో 90 వేల ఉద్యోగాలను భర్తీ చేసే ప్రక్రియ కొనసాగుతున్నది.హైదరాబాద్ లో నాలుగు సూపర్ స్పాషాలిటీ ఆసుపత్రులు రాబోతున్నాయి..వరంగల్ నగరంలో ఇప్పటికే వేగంగా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం జరుగుతున్నది.

ఇప్పటిదాకా ఉపాధ్యాయులు మరి యు జర్నలిస్టుల హెల్త్ స్కీం కింద 3.52 లక్షల మంది చికిత్స కోసం 1422 కోట్ల ఖర్చు.. నూతనంగా 29 మెడికల్ కాలేజీల ఏర్పాటు ..తెలంగాణ ఏర్పాటుకు ముందు కేవలం ఐదు మెడికల్ కాలేజీలు 700 ఎంబిబిఎస్ సీట్లు. ప్రస్తుతం 29 ప్రభుత్వ మెడికల్ కాలేజీలలో 2790, 24ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో 3800 మెత్తంగా 6590 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. సుమా రు 480 కోట్ల రూపాయలతో మెడికల్ కాలేజీల నిర్మాణాలు. 14 నర్సింగ్ కాలేజీలో నిర్మాణానికి 560 కోట్లు.. 3779 కోట్లతో నాలుగు సూపర్ స్పెషాలిటీహాస్పిటళ్ల నిర్మాణం..కంటి వెలుగు కార్యక్రమంతో కోటిన్నర మందికి పరీక్షలు, 41లక్షల మందికి కళ్లద్దా లు. 973 గురుకుల పాఠశాలలో సుమారు 5.30 లక్షల మందికి పైగా విద్యార్థులు. ప్రతి ఒక్కరికి 1,25,000 వార్షిక ఖర్చు.ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి మన ఊరు- మనబడి కార్యక్రమం. 7289 కోట్లతో మూడు దశల్లో 26, 065 పాఠశాలల సమూల మార్పు.

అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం బోధన.. పల్లె ప్రగతి..13,528 కోట్ల ఖర్చు..ఇప్పటిదాకా పట్టణాలకు రాష్ట్ర ప్రభుత్వం 3800 కోట్లను అందించింది..టీఎస్ బి పాస్ చట్టం.. నూతన పురపాలక చట్టాలు. మిషన్ భగీరథ, అర్బన్ మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నీటి సరఫరాపారిశుధ్య కార్మికుల జీతాల పెంపు. నూతనంగా పారిశ్యుద్ధ వాహనాల ఏర్పాటు.డంపు యార్డుల ఏర్పాటు, బయోమైనింగ్, గ్రీన్ బడ్జెట్,మానవ వ్యర్ధాల నిర్వహణ ప్లాంట్‌ల ఏర్పాటు లాంటి వినూత్న కార్యక్రమాలతో స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డులు. గ్రామాలు, పట్టణాల్లోని వీధి దీపాలను ఎల్‌ఈడీ లైట్లుగా మార్చడం. పల్లెలు, పట్టణాల్లో క్రీడా ప్రాంగణాల ఏర్పాటు.అవార్డులు, రివార్డులు.. ప్రశంసలు..

శాంతి భద్రతలు

రాష్ట్రం ఏర్పడగానే శాంతి భద్రతల పటిష్టతపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టి.. పోలీసులకు నూతన వాహానాలు, పోలీసు ఉద్యోగాల భర్తీ అంతర్జాతీయ స్థాయి కమాండ్ కం ట్రోల్ సెంటర్ నిర్మాణం. మహిళల భద్రత కోసం షీ టీమ్స్, భరోసా కేంద్రాల ఏర్పాటు. సుమారు 330 కి పైగా షీ టీమ్స్ పనిచేస్తున్నాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా ట్రాఫిక్ పోలీసులకు ప్రత్యేకంగా 30 శాతం అలవెన్స్. రాష్ట్రంలో గ్యాం బ్లింగ్, పేకాట క్లబ్బుల మూసివేత.. పది లక్షలకు పైగా సీసీ కెమెరాలు వినియోగిస్తున్న సురక్షిత రాష్ట్రంగా తెలంగాణ.. సింగరేణి సంస్థ ప్రైవేటీకరణపై పోరాటం..నాలుగు బొగ్గు బ్లాక్ లను వేసేందుకు కేంద్రం కుట్ర..సీఎం కేసీఆర్ ప్రధానికి లేఖ రాశారు..బొగ్గు బ్లాకులను సింగరేణికి నేరుగా కేటాయించాలని డిమాండ్.. విప్లవాత్మకమైన టిఎస్ ఐపాస్ చట్టం రూపకల్పన. ఇప్పటిదాకా సుమారు పరిశ్రమల అనుమతులు.. లక్షల కోట్ల పెట్టుబడి.. సుమారు లక్షల ఉద్యోగాలు.. టీ ప్రైడ్ ద్వారా 61 వేల మంది దళిత, గిరిజన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు సుమారు 2500 కోట్ల ప్రోత్సాహకాలు. టీ ఐడియా ద్వారా 24,325 మంది పారిశ్రామికవేత్తలకు సుమారు 3200 కోట్ల ప్రోత్సహకాలు. అంతర్జాతీయ స్ధాయి పారిశ్రామిక మౌళిక వసతుల ఏర్పాటు. హైదరాబాద్ ఫార్మాసిటీ, కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ తదితర పారిశ్రామిక పార్కుల ఏర్పాటు..

హరితహారం..

ప్రభుత్వాల ముందు చూపులేని దృక్పథంతో అభివృద్ధి ప్రక్రియలో పర్యావరణం సమిధగా మారుతుంది. భవిష్యత్తు తరాలకు సమతుల్యమైన సమాజాన్ని, ఆహ్లాదకరమైన పరిసరాలను అందించాలన్న సత్సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు హరితహారం కార్యక్రమాన్ని చేపట్టారు. బ్రెజిల్, చైనా తర్వాత మూడవ అతిపెద్ద మానవ మహా ప్రయత్నం మన హరితహారం కార్యక్రమం . 8 ఏళ్లలో సుమారు 9950 కోట్ల రూపాయల ఖర్చుతో 271 కోట్ల మొక్కలు నాటడం జరిగింది. 9.30 లక్షల ఎకరాల అడవుల పునరుద్ధరణ. రాష్ట్రంలో 7.7శాతం గ్రీన్ కవర్ పెరిగిందని ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా రిపోర్ట్.. దేశంలో ఎక్కడ లేని విధంగా గ్రీన్ బడ్జెట్ ఏర్పాటు..

పరిపాలన సంస్కరణలు..

పాలనా సౌలభ్యం, మరింత మెరుగైన పౌర సేవల కోసం జిల్లాల విభజన. కొత్తగా 23 జిల్లాల ఏర్పాటు. హైదరాబాద్ కి ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చిన ప్రభుత్వం.. గ్రేటర్ హైదరాబాద్ లో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు, రోడ్డు నెట్వర్క్ బలోపేతం చేసేందుకు ఎస్‌ఆర్‌డిపి, సిఆర్‌ఎంపీ ప్రాజెక్ట్, లింక్, మిస్సింగ్ లింక్ రోడ్ల నిర్మాణం.. ఎస్‌ఎన్‌డిపి ప్రాజెక్ట్..సుమారు 4500 కోట్ల రూపాయల పెట్టుబడితో హైదరాబాద్ నగరానికి నిరంతరం విద్యుత్తు అందేలా మౌలిక వసతుల కల్పన చేపట్టిన విద్యుత్ సరఫరా సంస్థ.హైదరాబాద్ నగర తాగునీటి అవసరాలను తీర్చడం కోసం అనేక పథకాలు. హైదరబాద్ అర్భన్ ఏరియా కోసం సూమారు .9000 వేల కోట్లతో పలు ప్రాజెక్టులు. 1900 కోట్ల అంచనా వ్యయంతో 40 లక్షల మందికి తాగునీరు అందించే ప్రత్యేక ప్రాజెక్టు. 4,765 కోట్ల రూపాయలతో ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ రింగ్ మెయిన్ ప్రాజెక్ట్.. జిహెచ్‌ఎంసి పరిధిలో సుమారు 1000 పార్కుల అభివృద్ది.. పంజాబ్ ముఖ్యమంత్రి వచ్చి పాఠాలు నేర్చుకుంటున్నారు. ఢిల్లీ సీఎం వచ్చి కితాబు ఇస్తున్నారు. అమెరికా సంస్థలు అవార్డులు ఇస్తున్నాయి. అనివార్యంగా కేంద్ర మంత్రిత్వ శాఖలు కూడా అవార్డులు ఇవ్వాల్సిన పరిస్థితిని కల్పించాం.

కేంద్రం సహకరించినా.. సహకరించకపోయినా తెలంగాణ ప్రజలకు మంచి చేయాలన్న మా నిబద్ధతను ఎవరూ దెబ్బతీయలేరు.. ఎన్ని అడ్డంకులు సృష్టించినా… తెలంగాణ ప్రగతి రథచక్రాలను ఆపడం ఎవరి తరం కాదు.. అసెంబ్లీ సాక్షిగా మరోసారి కుండబద్దలు కొడుతున్న.. కేంద్ర సర్కారుకు కార్పొరేట్ ముఖ్యమేమో… కానీ.. మాకు కామన్ మ్యానే ముఖ్యం. సామాన్య ప్రజల సంక్షేమమే మా ప్రభుత్వ సంకల్పం. అట్టడుగు వర్గాల అభ్యున్నతే మా ఏకైక లక్ష్యం..దేశంలో కావాల్సింది డబుల్ ఇంజన్ సర్కారు కాదు..తెలంగాణ లాంటి డబుల్ ఇంపాక్ట్ సర్కార్..తెలంగాణ నమూనా దేశానికి స్ఫూర్తినిస్తోంది.కేంద్రం నుంచి మొదలుకుని అనేక రాష్ట్రాలు తెలంగాణను ఆదర్శంగా తీసుకుంటున్నాయి. ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతున్న మా పథకాలను అమలుచేస్తున్నాయి. అందుకే ఈరోజు తెలంగాణ మోడల్ దేశవ్యాప్తం కావాల్సిన ఆవశ్యకత ఉంది.

మీటర్ పెట్టాలని
మెడపై కత్తి పెట్టినా..

పాలకుడికి చిత్తశుద్ధి, నిబద్ధత పక్కా ప్రణాళిక ఉంటే.. విద్యుత్ రంగంలో అసాధారణ విజయాలు ఎలా సాధించవచ్చో తెలంగాణ విద్యుత్ రంగం చాటి చెప్పిందని మంత్రి కెటిఆర్ అన్నారు. నాడు 19 లక్షల 3 వేల వ్యవసాయ కనెక్షన్లు ఉంటే ఇప్పుడా సంఖ్య 27 లక్షల 13వేలకు పెరిగింది. ఎనిమిదేండ్లలో కొత్తగా ఎనిమిది లక్షల మోటర్లకు కనెక్షన్లు ఇచ్చినం. దేశంలో ఉన్న రైతన్నల మోటార్లకు మీటర్లు పెట్టి వాళ్లను వ్యవసాయ రంగానికి దూరం చేసే కుట్రల్ని కేంద్ర ప్రభుత్వం చేస్తుంటే మేము మాత్రం నిరంతరం ఉచిత విద్యుత్తు ఇచ్చి అన్నదాతల్ని అదుకుంటున్నాం. ఒకవైపు మోటార్లకు మీటర్లు పెట్టాలని కేంద్రం మా మెడపై కత్తిపెట్టినా కూడా రాష్ట్ర రైతాంగ ప్రయోజనాలను కాపాడడం కోసం సుమారు 6000 కోట్ల రూపాయల రుణ అవకాశాన్ని కూడా వదులుకున్నాం. 2015లో 11,189 మిలియన్ యూనిట్లు..2021-22లో 19వేల 2024 మిలియన్ యూనిట్లకు పెరిగిన వ్యవసాయ విద్యుత్ వినియోగం.

పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తిలోనూ మనమే టాప్… కేంద్రం ఇచ్చిన టార్గెట్ 2మెగా వాట్లైతే… మనం లక్ష్యానికి మించి 250 శాతం అధికంగా 5078 మె.వా ఉత్పత్తికి చేరుకున్నాం. యాదాద్రి ఆల్ట్రా మెగా పవర్ ప్లాంట్‌పై కుట్రలు.. కేంద్రం ఒత్తిడితో రుణాన్ని ఆపిన ఆర్‌ఈసీ.. పీఎఫ్సీ సంస్థలు..చివరికి కేంద్ర పరిశ్రమల శాఖా మంత్రి మహేంద్రనాథ్ పాండే.. కేంద్ర విద్యుత్ శాఖ మంత్రికి లేఖ రాసి..రుణాలు ఆపడం వల్ల ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యమై దేశ విద్యుత్ డిమాండ్ తీర్చడం కష్టం అవుతుందని, బీహెచ్‌ఈల్ తీవ్రంగా నష్టపోతుందని హెచ్చరించారు. విభజన చట్టం ప్రకారం ఎన్టీపీసీ 4వేల మెగావాట్ల ప్లాంట్‌ను నిర్మించాలి..తొలి దశలో 1600 మెగావాట్లు 2019 నాటికే అందుబాటులోకి రావాల్సిందన్నారు.

ఇవాళ దేశం చూపు.. మన రాష్ట్ర సిఎం కెసిఆర్ వైపు

తెలంగాణ ప్రగతిలాగే దేశం పరుగులు పెట్టి ఉంటే 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ కల ఎప్పుడో నెరవేరేది. దొంగపై దాడిని.. దేశంపై దాడిగా అభివర్ణించడం ఎంటి.. ప్రధాని.. అదాని మాత్రమే ఈ దేశానికి ప్రతినిధులా?. దేశమంటే ప్రధాని-అదాని మాత్రమే కాదు. దేశమంటే 140 కోట్ల ప్రజలని వాళ్లకు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ దేశంలో అదాని – ప్రధాని తప్ప మరో చర్చ లేదు. తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసమే కాకుండా దేశ ప్రజల సర్వతోముఖాభివృద్ధికి, సంక్షేమానికి ఒక బాధ్యత కలిగిన ప్రజాప్రతినిధుల ప్రభుత్వంగా మేం కృషి చేస్తాం.. తెలంగాణ ప్రజలకు అందుతున్న అద్భుతమైన పరిపాలనా ఫలాలు.. దేశ ప్రజలకు కూడా అందించాల్సిన అవసరం ఉంది. దేశమంతా కిసాన్ సర్కార నినాదం వినిపిస్తాం.. తెలంగాణతో కేసిఆర్‌కు ఉన్న పేగుబంధం తెంపెధైర్యం ఎవరికుంది..కర్ణాటకలో అప్పర్‌భద్రకు రూ5వేలకోట్లు కేటాయిస్తే తెలంగాణలో వీరికి చీమకుట్టినట్టుకూడా అనిపించేలేదా..అంటూ కేటిఆర్ ప్రతిపక్ష పార్టీలను దునుమాడారు..

సంక్షేమ రంగం
సంక్షేమ రంగానికి సరికొత్త చిరునామాగా దేశానికి దిశా నిర్దేశం చేస్తోంది తెలంగాణ.చరిత్ర ఎరుగని వినూత్నమైన సంక్షేమ కార్యక్రమాలతో మేం ముందుకు పోతున్నం. దేశం ఎరుగని వందలాది సంక్షేమ కార్యక్రమాలు..ప్రతి సంవత్సరం సంక్షేమంపై 50 వేల కోట్లకు పైగా ఖర్చు. ఆసరా పించన్లు 44.50 లక్షలకు పైగా లబ్ధిదారులకు 52,000 కోట్ల రూపాయల ఖర్చు. 2004 నుంచి 2014 మధ్యలో అప్పటి ప్రభుత్వాలు పెన్షన్లపై చేసిన ఖర్చు కేవ లం 5558 కోట్లు మాత్రమే. 15 లక్షల 74 వేల వితంతు పెన్షన్లు, 1,43,468 మంది ఒంటరి మహిళలకు పెన్షన్, నాలుగు లక్షల 25 వేల మంది బీడీ కార్మికులకు పెన్షన్, 5 లక్షల 13 వేల దివ్యాంగులకు పెన్షన్, 66 వేల గీత కార్మికులకు పెన్షన్,37వేల 500 మంది నేత కార్మికులకు పెన్షన్, 4,500 మంది డయాలసిస్ బాధితులకు పెన్షన్, సుమారు 2 వేల మంది కళాకారులకు పెన్షన్ ఇస్తున్నం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News