Saturday, November 23, 2024

మొదటి డోసు టీకా తీసుకున్న కెటిఆర్

- Advertisement -
- Advertisement -

Minister KTR Received Covid19 vaccine

హైదరాబాద్: ఐటి పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ కరోనా టీకా తీసుకున్నారు. టీకా మొదటి డోసు తీసుకున్న కెటిఆర్, వ్యాక్సిన్ వేసుకున్న ఫోటోను ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. టీకా వేసిన నర్సు కెరినా జ్యోతి, సహకరించిన వైద్యులు డాక్టర్ శ్రీకృష్ణకు ధన్యవాదాలు తెలిపారు. వీళ్లతో పాటు ఫ్రంట్‌లైన్ వారియర్లుగా విశేష సేవలందిస్తోన్న వైద్య, ఆరోగ్యశాఖ సిబ్బందికి ట్యిట్టర్ వేదికగా తన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. మంత్రి కెటిఆర్ చేసిన పోస్టుకు ఎంతో మంది నెటిజన్లు స్పందించారు. వ్యాక్సిన్ తీసుకున్నాక కొంత అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉందని పలువురు జాగ్రత్తలు చెప్పారు.

మరికొంతమంది ఆయన వేసుకున్న వ్యాక్సిన్ ఏంటని ఆసక్తిగా అడిగారు. ఇంకొందరు.. ఇప్పటికే చాలా లేటయిందని నిట్టూర్చగా.. దానికి సమాధానాలిచ్చే పనిలో మరికొంతమంది ట్వీట్లు చేశారు. ఏప్రిల్ 23న మంత్రి కెటిఆర్ కరోనా బారిన పడ్డారు. వైద్యుల సలహా మేరకు హోం ఐసోలేషన్‌లో ఉండి కోలుకున్నారు. కరోనా సమయంలో తనకు కూడా తీవ్ర ఇన్‌ఫెక్షన్ సోకినట్లు మంత్రి ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. డాక్టర్లు చెప్పిన సూచనలు పాటిస్తూ అన్ని జాగ్రత్తలు తీసుకోవటం వల్ల మహమ్మారిని జయించగలిగానని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు టీకా తీసుకోవాలని సూచించిన కెటిఆర్, కరోనా బారిన పడటం వల్ల ఇన్ని రోజులు వ్యాక్సిన్ తీసుకోలేదు. కరోనాను జయించిన అనంతరం మూడు నెలల తర్వాత వ్యాక్సిన్ వేసుకోవచ్చునన్న వైద్యుల సూచన మేరకు మంగళవారం టీకా మొదటి డోసును మంత్రి కెటిఆర్ తీసుకున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News