- Advertisement -
హైదరాబాద్: పార్లమెంటరీ ప్యానెల్ నివేదికపై రాష్ట్ర ఐటీ,పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ స్పందించారు. వ్యాపారవేత్తలను ఆకర్షించడంలో దేశం విఫలమైందని ప్యానెల్ తెలిపింది. చైనా నుంచి బయటు వచ్చే వ్యాపారులను ఆకర్షించలేదని నివేదికలో స్పష్టం చేసింది. బిజెపికి ఆర్థికం కంటే రాజకీయమే ప్రాధాన్యమైందని కెటిఆర్ ఆరోపించారు. రాజకీయానికి ప్రాధాన్యమిస్తే ఫలితాలు ఇలాగే ఉంటాయని మంత్రి విమర్శించారు. టెలిప్రాంప్టర్ చూసి ప్రసంగించడం సులువేనన్నారు. పటిష్ట ప్రయత్నాలు లేకపోతే ఫలితాలు రావడం కష్టమని మంత్రి కెటిఆర్ సూచించారు.
- Advertisement -