Saturday, November 23, 2024

మోడీ సర్కార్ అరాచకాలకు ఇవీ నిదర్శనాలు..

- Advertisement -
- Advertisement -

ప్రశాంత్ భూషణ్ ట్వీట్‌ను రీట్వీట్ చేసిన మంత్రి కెటిఆర్

హైదరాబాద్ : ప్రజలు ఎన్నుకున్న బిజెపీయేతర ప్రభుత్వాలను కూలదోసేందుకు, ఇతర పార్టీల నుంచి బిజెపిలోకి ఫిరాయింపు లను ప్రొత్సహించేందుకు, ప్రతిపక్ష పార్టీలను వేధించేందుకు కేంద్ర ప్రభుత్వం కేంద్ర దర్యాప్తు సంస్థలను పావులుగా వాడుకుంటున్నది. కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ సర్కార్ అరాచకానికి, దుర్మార్గానికి పాల్పడుతుందని ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ట్వీట్ చేశారు. బిజెపియేతర ప్రభుత్వాలను కూలదోసేందుకు కేంద్రం దర్యాప్తు సంస్థలను విచ్చలవిడిగా వాడుతుందన్నారు.

దీనికి సంబంధించి ఆయన ఓ ట్వీట్ చేశారు. ‘ఈక్వా లిటీ బిఫోర్ లా..?’ అనే శీర్షికతో మోడీ అరాచకాలను ట్విట్టర్‌లో ఏకిపారుశారు. మహారాష్ట్రలో నారాయణరాణే, బెంగాల్‌లో సువేంధు అధికారిని, అసోంలో హిమాంత బిశ్వశర్మ లాంటి నాయకులను కేంద్ర సంస్థలను ఉపయోగించి మోడి సర్కార్ దారిలోకి తెచ్చుకుందన్నారు. దీనికి ‘హౌ ద మోడీ గవర్నమెంట్ మిస్ యూజెస్ ద ఏజెన్సీస్ టు టాపిల్ గౌట్స్, ఇండ్యూస్ డిఫెక్షన్స్ అండ్ హరాస్ అప్పొజిషన్’ అనే క్యాప్షన్ పెట్టారు. ప్రశాంత్ భూషణ్ పెట్టిన ఈ ట్వీట్‌ను కెటిఆర్ రీట్వీట్ చేసి పరోక్షంగా మోడీ సర్కార్‌పై మండిపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News