Wednesday, January 22, 2025

హనుమకొండ అభివృద్ధిపై మంత్రి కెటిఆర్ సమీక్ష

- Advertisement -
- Advertisement -

Minister KTR review on Hanamkonda development

వరంగల్: హనుమకొండ జిల్లా అభివృద్ధిపై కలెక్టరేట్ లో మంత్రి కెటిఆర్ బుధవారం సమీక్ష నిర్వహించారు. మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి రాథోడ్, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… టిఎస్ బిపాస్ ద్వారా మాత్రమే నిర్మాణాలకు అనుమతి ఇవ్వాలన్నారు. ప్రతి మున్సిపాలిటీలో వెజ్, నాన్ వెజ్ మార్కెట్లు నిర్మించాలని మంత్రి తెలిపారు. ప్రతి మున్సిపాలిటీలో వైకుఠధామం ఉండలన్నారు. గ్రీన్ బడ్జెట్ సద్వినియోగం చేసుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు. ఆధునిక దోబీ ఘాట్లు నిర్మాణం కావాలని చెప్పారు. బయో మైనింగ్ ద్వారా డంప్ యార్డులో చెత్త నిర్వీర్యం చేయాలని పేర్కొన్నారు. ప్రతి మున్సిపాలిటీలో మానవ వ్యర్థాల శుద్ధీకరణ ప్లాంట్ నిర్మించాలని వెల్లడించారు. పేదలకు రూపాయి నల్లా కనెక్షన్ ఇవ్వాలని తెలిపారు. అన్ని పట్టణాల్లో మాస్టర్ ప్లాన్ పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు. డిజిటల్ డోర్ నంబరింగ్ ప్రక్రియ వేగవంతం మంత్రి ఆదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News