- Advertisement -
హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో పట్టణాల్లో ఉన్న పరిస్థితులపై పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గురువారం సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ నగరంలోనూ పలు ప్రాంతాల్లో మంత్రి పర్యటిస్తున్నారు. వర్షాల కురుస్తున్న నేపథ్యంలో ప్రాణ నష్టం జరగకుండా చూడడమే ప్రాథమిక ప్రాధాన్యతగా అధికారులు పని చేయాలని సూచించారు. హుస్సేన్ సాగర్ ప్రాంతాల్లో మంత్రి పర్యటించారు. హైదరాబాద్ లో కుండపోత వర్షం కురుస్తోంది. పలు కాలనీల్లోకి భారీగా వరద నీరు చేరింది. నగరంలో 15 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో కెటిఆర్ పర్యటిస్తున్నారు. మంత్రి వెంట జిహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్, పలువురు ఉన్నతాధికారులు ఉన్నారు
- Advertisement -