హైదరాబాద్: భారీ వర్షాలు, వరదల దృష్ట్యా హైదరాబాద్ తో పాటు పలు పట్టణాల్లోని పరిస్థితులపై పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ బుధవారం ప్రగతిభవన్ నుంచి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రాణనష్ట నివారణే ధ్యేయంగా పనిచేయాలని కెటిఆర్ ఆదేశించారు. హైదరాబాద్ తో పాటు ఇతర ప్రాంతాల్లోని భారీ వర్షాల వల్ల ప్రభావితమైన ప్రాంతాల పైన ప్రత్యేక దృష్టి సారించి సహాయక చర్యలను వేగంగా ముందుకు తీసుకుపోవాలని అధికారులకు సూచించారు. వర్షాల వల్ల పురాతన భవనాలు కూలే ప్రమాదం ఉన్న నేపథ్యంలో ప్రమాదకరంగా ఉన్న వాటిని తొలగించే చర్యలు కొనసాగించాలన్నారు. కల్వర్టులు, వంతెనల వద్ద హెచ్చరిక సూచీలు పెట్టాలనియంత్రాంగాన్ని ఆదేశించారు. జిహెచ్ఎంసి, జలమండలి సేవలు ఉపయోగించుకోవాలన్నారు. పురపాలకల్లో సహాయచర్యలను సిడిఎంఏ పర్యవేక్షించాలన్నారు. పట్టణాల్లో లోతట్టు ప్రాంతాలపై ప్రధానంగా దృష్టి పెట్టాలని మంత్రి పేర్కొన్నారు. సాగునీటి వనరులకు సంబంధించిన పర్యవేక్షణ కొనసాగించాలన్నారు. వర్షాలు తగ్గాక అత్యవసరమైన రోడ్ల మరమ్మత్తులు చేపట్టాలని ఆదేశించారు.
ఉన్నతాధికారులతో మంత్రి కెటిఆర్ వీడియో కాన్ఫరెన్స్
- Advertisement -
- Advertisement -
- Advertisement -