Sunday, January 19, 2025

సహాయక చర్యల స్పీడ్ పెంచండి

- Advertisement -
- Advertisement -

భారీ వర్షాలతో
అప్రమత్తంగా ఉండాలి

ప్రాణనష్టం జరగకుండా అన్ని శాఖలు కలిసి
పనిచేయాలి కల్వర్టులు, బ్రిడ్జీలపై
దృష్టి సారించాలి అధికారులకు మంత్రి
కెటిఆర్ ఆదేశం జిహెచ్‌ఎంసి, జల మండలి,
పురపాలక శాఖ అధికారులతో మంత్రి సమీక్ష

 

n భారీ వర్షాల కారణంగా పట్టణ ప్రాంతాల్లో ప్రాణనష్టం జరగకుండా అన్ని శాఖలు కలిసి పనిచేయాలి
n జిహెచ్‌ఎంసి, జలమండలి, పురపాలక శాఖ అధికారులతో మంత్రి కెటిఆర్ సమీక్ష

మన తెలంగాణ/హైదరాబాద్ : భారీ వర్షాల కారణంగా పట్టణ ప్రాంతాల్లో ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా అన్నిశాఖలు కలిసి పనిచేయాలని, వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను వేగవంతం చేయాలని పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ అధికారులను ఆదేశించారు. ప్రగతిభవన్ నుంచి జిహెచ్‌ఎంసి, జలమండలి, పురపాలక శాఖ అధికారులతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బుధవారం సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్‌తో పాటు పలు పట్టణాలు, అక్కడి పరిస్థితుల గురించి ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు. హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో భారీ వర్షాల వల్ల ప్రభావితమైన ప్రాంతాలపై ప్రధానంగా దృష్టి సారించి సహాయక చర్యలు వేగంగా ముందుకు తీసుకెళ్లాలని మంత్రి కెటిఆర్ సూచించారు. వర్షాలు ఇలాగే కొనసాగితే చేపట్టాల్సిన ముందస్తు జాగ్రత్త చర్యలపై ఇప్పటి నుంచే సిద్ధంగా ఉండాలని అధికారులను ఆయన ఆదేశించారు. వరుసగా కురుస్తున్న వర్షాలతో పురాతన భవనాలు కూలే ప్రమాదం ఉన్నందున, ప్రమాదకరంగా ఉన్న వాటిని తొలగించే చర్యలు కొనసాగించాలని మంత్రి పేర్కొన్నారు. పట్టణాల్లో ఉన్న కల్వర్టులు, బ్రిడ్జిలకు సంబంధించిన ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి సారించి హెచ్చరిక సూచీలను ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు.

పోలీసు, సాగునీటి, విద్యుత్, రెవెన్యూ శాఖలతో సమన్వయం

పోలీసు, సాగునీటి, విద్యుత్, రెవెన్యూ శాఖలతో సమన్వయం చేసుకోవాలని పురపాలక శాఖ అధికారులతో ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్ నగరం, పరిసర పురపాలికల్లోని యంత్రాంగం, స్థానిక జలమండలిలతో కలిసి వరద నివారణ, తగ్గింపు చర్యలు చేపట్టాలని మంత్రి కెటిఆర్ పేర్కొ న్నారు. ప్రస్తుతం ఉన్న జిహెచ్‌ఎంసి, జలమండలి కమాండ్ కంట్రోల్ సెంటర్లను విస్తృతంగా ఉపయోగించుకోవాలని, రాష్ట్రంలోని అన్ని పురపాలికల్లో చేపడుతున్న చర్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సిడిఎంఏ సత్యనారాయణను మంత్రి కెటిఆర్ ఆదేశించారు. పట్టణాల్లో ఉన్న లోతట్టు ప్రాంతాలపై ప్రధానంగా దృష్టి సారించాలని చెరువులు, కుంటలు, ఇతర సాగునీటి వనరులకు సంబంధించిన పర్యవేక్షణ నిరంతరం కొనసాగించాలని మంత్రి ఆదేశించారు. వాటి పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యం, ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో వంటి అంశాలపై నీటిపారుదల శాఖలతో నిరంతరం పర్యవేక్షణ చేయాలని మంత్రి కెటిఆర్ అధికారులకు స్పష్టం చేశారు. వర్షాలు తగ్గుముఖం పట్టగానే అత్యవసరమైన రహదార్ల మరమ్మతులను వెంటనే ప్రారంభించాలని ఆయన ఆదేశించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News