Monday, December 23, 2024

ప్లీనరీలో రేపు 11 గంటలకు సిఎం కెసిఆర్ ప్రసంగం

- Advertisement -
- Advertisement -

KTR Reviews Arrangements for TRS Plenary

హైదరాబాద్: టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని హైటెక్స్ లో కార్యక్రమ ఏర్పట్లను మంత్రి కెటిఆర్ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… ప్లీనరీలో రేపు ఉదయం 11 గంటలకు సిఎం కెసిఆర్ ప్రసంగం ఉంటుందని తెలిపారు. రాష్ట్ర పథకాలను కేంద్రం కాపీ కొట్టాల్సిన పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు. ప్లీనరీలో జాతీయ అంశాలపై కీలక చర్చ ఉంటుందన్నారు. కేంద్ర ప్రభుత్వంలోని పరిపాలకులకు సోయి వచ్చేలా అజెండా ఉంటుందని మంత్రి కెటిఆర్ స్పష్టం చేశారు. రేపు ఉదయం 11గంటల నుంచి సాయంత్రం 5వరకు కార్యక్రమం కొనసాగనుంది. 3 వేల మందికిపైగా ప్రతినిధులు సభకు హాజరుకానున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News