Friday, November 22, 2024

కర్నాటకలో కాంగ్రెస్ వచ్చింది.. కరెంటు పోయింది

- Advertisement -
- Advertisement -

కొడంగల్: దేశానికి ఆదర్శంగా తెలంగాణ ముందుకెళ్తోందని మంత్రి కెటిఆర్ అన్నారు. భారత రాష్ట్ర సమితి అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డికి మద్దతుగా కెటిఆర్ గురువారం ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ర్యాలీలో మాట్లాడుతూ… కర్నాటకలో కాంగ్రెస్ వచ్చింది… కరెంట్ పోయింది. కర్నాటక రైతులు కొడంగల్ వచ్చి ధర్నాలు చేస్తున్నారని తెలిపారు. కర్నాటక ప్రజలు చెంపలు వేసుకుంటున్నారన్నారు. 24 గంటల విద్యుత్ కాదని 5 గంటు ఇస్తామంటున్నారని తెలిపారు.

కొడంగల్ పేరును అంతర్జాతీయ స్థాయిలో చెడగొట్టిన వ్యక్తి రేవంత్ రెడ్డి అన్నారు. రూ.50 లక్షలతో అడ్డంగా దొరికిన దొంగ రేవంత్ రెడ్డి అని కెటిఆర్ వెల్లడించారు. బిఆర్ఎస్ అభ్యర్థి నరేందర్ రెడ్డిన ప్రజలు గెలిపించాలని కెటిఆర్ కోరారు. కెసిఆర్ కాళ్లు పట్టుకునైనా నరేందర్ రెడ్డికి ప్రమోషన్ ఇస్తానని కెటిఆర్ వెల్లడించారు. మళ్లీ ఓటమి ఎందుకని రేవంత్ రెడ్డి నామినేషన్ వెనక్కి తీసుకుంటారని జోస్యం చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News