Thursday, December 26, 2024

కొడంగల్ రోడ్ షో రేవంత్ పై కెటిఆర్ సంచలన వ్యాఖ్యలు

- Advertisement -
- Advertisement -

కొడంగల్ ను అద్భుత నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కొడంగల్ బిఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డికి మద్దతుగా కెటిఆర్ ర్యాలీలో పాల్గొన్నారు. రెండేళ్లలో కొడంగల్ లోని 1.25 లక్షల ఎకరాలకు కృష్ణా నీళ్లిస్తామని తెలిపారు. ఈ రోడ్ షో రేవంత్ పై కెటిఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జనంలో ఉండే ఎమ్మెల్యే కావాలా? జైలుకు పోయే ఎమ్మెల్యే కావాలా? అని కెటిఆర్ ప్రజలను ప్రశ్నించారు. కెసిఆర్ కాళ్లు పట్టుకునైనా నరేందర్ రెడ్డికి ప్రమోషన్ ఇస్తాస్తానని ఆయన తెలిపారు. రేవంత్ రెడ్డి త్వరలోనే జైలుకు వెళ్లి చిప్పకూడు తింటారని సూచించారు. ముచ్చటగా మూడోసారి కెసిఆర్ సిఎం అవుతారన్నారు.

గొడలపై సున్నాలు వేసే వ్యక్తి రూ. వేల కోట్లు ఎలా సంపాదించారని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి నమ్ముకున్నది పైసలను… లీడర్లను కొంటున్నారని కెటిఆర్ ఆరోపించారు. కొడంగల్ ప్రజలను మాత్రం రేవంత్ కొనలేరని తేల్చిచెప్పారు. మోసాన్ని మోసంతోనే జయించాలని కెటిఆర్ సూచించారు. కాంగ్రెస్ నేతలు అన్యాయంగా సంపాదించిన డబ్బులు ఇస్తే తీసుకోండి.. ఎన్నికల రోజున మాత్రం కారు గుర్తుకే ఓటు వేయండని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News