Wednesday, January 22, 2025

రైతుబంధు కావాలా? రాబందు కావాలా?

- Advertisement -
- Advertisement -

మునుగోడు ఓటర్లకు మంత్రి కెటిఆర్ పిలుపు

మనతెలంగాణ/యాదాద్రి భువనగిరి ప్రతినిధి: రైతు బంధు కావాలో, రాబందు కావాలో మునుగోడు ఓటర్లు తేల్చుకోవాలని టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటిశాఖ మంత్రి కెటిఆర్ పిలుపు ఇచ్చారు. మునుగోడు ఉప ఎన్నికల ప్రచార ఘట్టం ఆఖరి రోజు ఆయన నియోజకవర్గంలోని సంస్థాన్ నారాయాణపురంలో రోడ్‌షో నిర్వహించారు. ఆయన వెంట మంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధులున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిజెపి కేంద్ర ప్రభుత్వం పై పలు విమర్శలు గుప్పించారు. సాధరణంగా ఎమ్మెల్యేలు చనిపోతే ఉప ఎన్నికలు వస్తాయి కానీ ఇక్కడ ఓ ఎమ్మెల్యే స్వార్థం కోసం గుజరాతీకి వేల కోట్ల రూపాయలకు అమ్ముడుపోతే ఈ ఉప ఎన్నిక వచ్చిందని ఆయన మండిపడ్డారు. తెలంగాణ ఆత్మ గౌరవాన్ని రూ.18 వేల కోట్ల కాంట్రాక్టుకు మోడీ కాళ్ల దగ్గర పెట్టారని విమర్శలు గుప్పించా రు. ఓటుకు తులం బంగారం ఇచ్చైనా గెలుస్తాననే పొగరుతో బిజెపి నాయకులు ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పెద్ద కాంట్రాక్టర్లను డీ కడుపులో పెట్టుకొని చూ సుకుంటున్నారని దుయ్యబట్టారు. కెసిఆర్ రాకముందు కరెంట్ ఎలా ఉండే.. ఇప్పు డు ఎలా ఉందని కెటిఆర్ ప్రజలను అడిగారు.‘ప్రధాని మోడీ సామాన్యుడి బతుకు నాశనం చేశారని, గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు అమాంతం పెంచేశారని, మోడీ అధికారంలో వచ్చినప్పుడు రూ.400ఉన్న గ్యాస్ సిలిండర్ ధర ఇప్పుడు రూ.1200కు చేరిందని మండిపడ్డారు. మోడీ వచ్చినప్పుడు పెట్రోల్ ధర రూ.70 ఉంటే ఇవా ళ మోదీ పుణ్యమా అంటూ 110 రూపాయలకు చేరిందనీ. కార్పొరేట్ శక్తులకు మోడీ కొమ్ముకాస్తున్నారని అన్నారు. గాడిదలకు గడ్డేసి ఆవులకు పాలు పిండితే పాలు వస్తాయా అన్ని ప్రశ్నించారు. ఎవరు పెద్దోళ్ల కోసం ఉన్నారు..? ఎవరు పేదోళ్ల కోసం ఉన్నారో, ప్రజలే ఆలోచించి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News