హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీపై రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ సెటైర్లు వేశారు. ఇటీవల వారణాసిలోని కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రారంభోత్సవం సందర్భంగా కూలీలతో కలిసి మోడీ భోజనం చేసిన ఫోటోలను మంత్రి కెటిఆర్ ట్వీట్ చేశారు. వీటితో పాటు కరోనా లాక్‌డౌన్ సమయంలో వలస కూలీలు కాలినడకన వెళ్తున్న దృశ్యాలను కూడా షేర్ చేశారు. ఈ రెండు ఘటనలను పోల్చుతూ మోడీ వైఖరిపై విమర్శలు చేశారు. ఎన్నికలు ఉంటే ఇలా.. కూలీలతో కలిసి భోజనం చేస్తారు. ఎన్నికలు లేకపోతే వలస కూలీలను గాలికొదిలేసి ప్రత్యక్ష నరకం చూపించారు అని కెటిఆర్ పేర్కొన్నారు. కాశీ విశ్వనాథ్ కారిడార్ నిర్మాణ కూలీలపై మోడీ చూపించిన ప్రేమను చూస్తుంటే ఆశ్చర్యమేస్తోందన్నారు. లక్షల మంది వలస కార్మికులు కరోనా లాక్‌డౌన్‌లో వందల కిలోమీటర్లు నడిచినప్పుడే ఈ ప్రేమ ఎక్కడకు పోయిందని ప్రశ్నించారు. వలస కూలీలను తమ స్వస్థలాలకు పంపించడానికి శ్రామిక్ రైళ్లను ఏర్పాటు చేసిన కేంద్రం బలవంతంగా ఛార్జీలను వసూలు చేసిందని కెటిఆర్ గుర్తు చేశారు.
Wonder where this love & empathy was when millions of migrant workers were walking hundreds of kilometres
In fact Govt of India coerced the states for train fares for shramik rails
ఎన్నికలు ఉంటే ఇలా.. కూలీలతో కలిసి భోజనం..లేకపోతే అలా.. వలస కూలీలను గాలికొదిలేసి, ప్రత్యక్ష నరకం pic.twitter.com/ycbozNXWtY
— KTR (@KTRTRS) December 19, 2021