Sunday, January 19, 2025

కేంద్రంపై మంత్రి కెటిఆర్ సెటైర్లు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : కేంద్రంపై మరోసారి రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ విమర్శలు చేశారు. ప్రధాని మోదీ అదానీ కోసం వన్ నేషన్ వన్ ఫ్రెండ్ పథకాన్ని తెచ్చారని ఎద్దేవా చేశారు. శ్రీలంకలో అదానీ ప్రాజెక్టుపై విమర్శలు చేశారు. ఎ మిత్ కాల్‌లో ‘వన్ నేషన్.. వన్ ఫ్రెండ్‘ అనేది కొత్త పథకమని వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. శ్రీలంకలో అదానీ ప్రాజెక్టును ఆ దేశ ఆర్థిక మంత్రి ‘ప్రభుత్వానికి, ప్రభుత్వానికి మధ్య ఒప్పందం‘ అని చెప్పారన్నారు.

దీనిపై వార్తలు వచ్చాయన్నారు. ఓ పత్రికా క్లిప్పింగ్స్ ను ట్వీట్ చేసిన మంత్రి కెటిఆర్ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. అదానీకి ప్రాజెక్టును కట్టబెట్టాలంటూ ప్రధాని మోడీ తన అధికారాన్ని ఉపయోగించారని గతంలో శ్రీలంక చేసిన వ్యాఖ్యలను కూడా గుర్తుచేశారు. మోడీ సర్కార్ అమృత కాలాన్ని ఎ మిత్ కాల్‌గా వ్యంగ్యంగాఅభివర్ణించారు. వన్ నేషన్, వన్ ఫ్రెండ్ అనేది మోడీ తీసుకొచ్చిన కొత్త పథకమని వ్యాఖ్యానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News