Thursday, January 23, 2025

ప్రధాని ఒక బ్రోకర్ అని నేను అనలేనా?: మంత్రి కెటిఆర్

- Advertisement -
- Advertisement -

సిరిసిల్ల: రాష్ట్ర ఐటిపురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సోమవారం సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా కెటిఆర్ బిజెపి నేతలపై విరుచుకుపడ్డారు. కరీంనగర్ కు ఏం చేశావో చెప్పాలని బండి సంజయ్ ని నిలదీయాలని మంత్రి కెటిఆర్ అన్నారు. సిఎంను పట్టుకుని బండి సంజయ్ బ్రోకర్ అంటున్నారు.. అదానీకి ప్రధాని మోడీ బ్రోకర్ అని నేను అనలేనా? కెటిఆర్ ప్రశ్నించారు. కానీ నాకు సంస్కారం ఉంది.. నేను అనను అని కెటిఆర్ పేర్కొన్నారు.

మా ఎమ్మెల్యేలను కొనేందుకు వచ్చిన బిఎల్ సంతోష్ బ్రోకర్ కాదా? నేను పేపర్ లీక్ చేసి అమ్ముకుని బతుకుతున్నానట… జీవితంలో రేవంత్, బండి ఎప్పుడైనా ఒక్కపరీక్షైనా రాసారా? అని కెటిఆర్ ప్రశ్నించారు. బిజెపి ఎంపి అరవింద్ ది ఫేక్ డిగ్రీ అని కెటిఆర్ ఆరోపించారు. తెలంగాణ పుట్టుకను అవమానించింది ప్రధాని మోడీ కాదా? గుజరాత్ గులాంల చెప్పులు మోసే బండి సంజయ్ తెలంగాణలో పుట్టడం దురదృష్టకరమన్నారు. దేశ సంపదను ప్రధాని మోడీ తన దోస్తులకు దోచి పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదానీ ఇచ్చే చందాల కోసం మోడీ దిగజారుతున్నారు. బిజెపి ఒక్కటే బతికుండాలె, అన్ని పార్టీలను చంపేయాలన్నదే మోడీ ఆలోచన అని కెటిఆర్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News