యువతకు ప్రియాంక గాంధీ క్షమాపణ చెప్పాలి
కాంగ్రెస్ ఫ్రస్టేషన్ లో ఉంది : మంత్రి కెటిఆర్
హైదరాబాద్: రాజకీయ నిరుద్యోగులు యువతను రెచ్చగొడుతున్నారని మంత్రి కెటిఆర్ ఆరోపించారు. ప్రియాంక గాంధీ రాజకీయ పర్యాటకులకు తెలంగాణ స్వాగతం చెబుతోందని కెటిఆర్ తెలిపారు. ప్రియాంక రాజకీయ పర్యటనకు వస్తున్నారు. రాజకీయ పర్యటనను ఎడ్యుకేషన్ టూర్ గా మార్చుకున్నారని తెలిపారు. రాష్ట్రంలోని సంక్షేమ పథకాలను ప్రియాంక తెలుసుకోవాలని కెటిఆర్ సూచించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు నిరుద్యోగం పెరిగిందని ఆరోపించారు.
నిరుద్యోగాన్ని పెంచినందుకు యువతకు ప్రియాంక క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగంలో 2.2 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నామని తెలిపారు. ప్రైవేటు రంగంలో 22 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నామన్నారు. పదేళ్లగా అధికారంలో లేకపోవడంతో కాంగ్రెస్ ఫ్రస్టేషన్ లో ఉందన్న కెటిఆర్ గాంధీభవన్ ను గాడ్సేకు ఇచ్చి కాంగ్రెస్ అంతానికి వీలునామా రాసుకుందని ఆయన పేర్కొన్నారు. ఎంప్లాయిమెంట్ విధానం ఉంటే దేశంలో నిరుద్యోగ సమస్య ఉండేది కాదని తెలిపారు.