Wednesday, January 22, 2025

కారేపల్లి అగ్నిప్రమాదంపై మంత్రి కెటిఆర్ దిగ్భ్రాంతి

- Advertisement -
- Advertisement -

కారేపల్లి : ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చీమలపాడులో బుధవారం జరిగిన అగ్నిప్రమాద ఘటనపై మంత్రి కెటిఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదం ఘటనపై ఆవేదన వ్యక్తం చేసిన మంత్రి కెటిఆర్ ఖమ్మం జిల్లా అధికారులు, నేతలతో కెటిఆర్ ఇప్పటికే మాట్లాడారు. మృతుడి కుటుబం, క్షతగాత్రులను ఆదుకుంటామని మంత్రి కెటిఆర్ హామీ ఇచ్చారు.

Also Read: బిఆర్‌ఎస్‌ ఆత్మీయ సమ్మేళనంలో అపశృతి: 10 మందికి గాయాలు (వీడియో)

గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. బిఆర్ఎస్ కార్యకర్తలు పేల్చిన బాణసంచాతో కారేపల్లిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఎనిమిదిమందికి తీవ్రగాయాలు కాగా, బానోతు రమేష్ అనే వ్యక్తి మృతిచెందాడు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News