Sunday, December 22, 2024

మహిళల పట్ల ప్రధాని మోడీకి గౌరవం ఉందా?: మంత్రి కెటిఆర్

- Advertisement -
- Advertisement -

Minister KTR slam Modi over release of 11 rapists

హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీపై రాష్ట్ర ఐటి,పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ చాన్స్ దొరికినప్పుడల్లా విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా ట్విటర్ వేదికగా కెటిఆర్, ప్రధానిపై ప్రశ్నల వర్షం కురిపించారు. మీకు నిజంగా మహిళలంటే గౌరవం ఉంటే వెంటనే ఆ పని చేయండి అంటూ కెటిఆర్ ప్రధానిని ట్యాగ్ చేస్తూ బుధవారం ట్వీట్ చేశారు. 2002లో గుజరాత్ రాష్ట్రంలో  బిల్కిస్ బానో గ్యాంగ్ రేపు కేసులో 11 మంది రేపిస్టులను ప్రభుత్వం విడుదల చేస్తున్నట్లు గుజరాత్ ప్రభుత్వం ప్రకటించింది. గుజరాత్ ప్రభుత్వ రెమిషన్ ఆర్డర్ పై మోడీ జోక్యం చేసుకోవాలని మంత్రి డిమాండ్ చేశారు. ఎంహెచ్ఏ ఆర్డర్ కు వ్యతిరేక చర్యలు అసహ్యంగా ఉన్నాయన్నారు. దేశం పట్ల మీకు ఉన్న చిత్తశుద్ధి నిరూపించుకోవాలన్నారు. గుజరాత్ ప్రభుత్వ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గుజరాత్ సర్కార్ నిర్ణయాన్ని ఇప్పటికే హైదరాబాద్ ఎంపి అసదుద్దీన్ ఒవైసి వ్యతిరేకించారు. తాజాగా కెటిఆర్ గుజరాత్ ప్రభుత్వం నిర్ణయాన్ని తప్పుబడుతూ ఈ మేరకు ట్విటర్ వేదికగా ప్రధాని మోడీని ప్రశ్నించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News