మన తెలంగాణ/కరీంనగర్ బ్యూరో: మరోసారి తెలంగాణలో సిఎం కెసిఆర్‌కు అవకా శం ఇవ్వాలని రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ కోరారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన బిఆర్‌ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో మంత్రి కెటిఆర్ పాల్గొని ప్రసంగించారు. మంత్రి గంగుల కమలాకర్ మీద పోటీ అంటే పోశమ్మ గుడి ముందు పొట్టేలు కట్టేసినట్టే అని పేర్కొన్నా రు. కరీంనగర్ ఎంఎల్‌ఎగా గంగులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఈ పదేండ్లలో ఎంతో అభివృద్ధి చేసుకున్నామని తెలిపారు. మానేరు నీళ్లకోసం జరిగిన కొట్లాటలు ఇంక కళ్లముందే గుర్తుకు వస్తున్నాయని తెలిపారు. నేడు మన తెలంగాణ రాష్ట్రంలో ఆ పరిస్థితి లేదన్నారు. కాళేశ్వరంతో కరీంనగర్ జిల్లా అంత సజీవ జలధారగా మారింద న్నారు. అభివృద్ధికి తోడు సంక్షేమం దీటుగా సిఎం కెసిఆర్ నాయకత్వంలో ముందుకు దూసుకెళ్తుందని అన్నారు. కమలాకర్ నాయకత్వంలో బిసి సంక్షేమం అద్భుతమైన ప్రగతి సాధించిందని తెలిపారు. చదువుకునేందుకు గురుకులాలు, విదేశాలకు పోయేవాళ్ళకి కూడా ఓవర్సీస్ స్కాలర్ షిఫ్ అందించి అండగా నిలబడ్డామని చెప్పారు.
హిందూ, ముస్లింల మధ్య కొట్లాటలు పెట్టే సన్నాసులు కరీంనగర్‌లో ఉన్నారని కేటీఆర్ ధ్వజ మెత్తా రు. కమలాకర్ చేతిలో చావు దెబ్బ తిని దొంగ ఏడుపుతో ఎంపీ అయ్యారని విమర్శించారు. ఎంపీ అయ్యాక కరీంనగర్‌కు ఏం చేశారు… ఓ బడి తేలేదు, కనీసం గుడి అయినా తేలేదని మండిపడ్డారు. కమలాకర్ అన్నపై పోటీ చేసేందుకు అందరూ జంకుతున్నారని అన్నారు. కాంగ్రెస్ వాళ్లు హుస్నాబా ద్ పారిపోయారు.. బీజేపీ వాళ్ళు పోటీకి వెనుక ముందు అవుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో సన్నబియ్యం పథకం అమలు చేయబోతు న్నాం అన్నారు. 15 లక్షల పరిమితితో కేసీఆర్ ఆరోగ్య రక్ష ఇస్తాం అని మంత్రి కేటీఆర్ స్పష్ట చేశారు. బిఆర్‌ఎస్‌ను గెలిపించి మళ్లీ అధికారం ఇవ్వం డి..ఆర్నెళ్లలో అమలు చేస్తాం అన్నారు.
సిఎం కెసిఆర్ అందరి నాయకుడు
సిఎం కెసిఆర్ అందరి నాయకుడని, హిందూ ముస్లిం అందరికి నేత అని అన్నారు. కేసీఆర్ గొప్ప హిందువు యాగాలు యజ్ఞాలు చేశారని గుర్తు చేశారు. నిజమైన హిందువు ఎవర్ని తిట్టడు అని అన్నారు. చావు నోట్లో తలపెట్టిన కెసిఆర్ ఒకవైపు…తెలంగాణ కోసం రాజీనామా చేయకుండా పారిపోయిన బిజెపి కిషన్ రెడ్డి, ఓటుకు నోటు దొంగ థర్డ్ క్లాస్ క్రిమినల్ రేవంత్ రెడ్డిలు మరోవైపు ఉన్నారని ఆరోపించారు.
మోడీ దేవుడా..? ఎందుకో బండి చెప్పాలి
ప్రధాని మోడీ దేవుడని అంటున్న కరీంనగర్ ఎండి బండి సంజయ్ గ్యాస్ ధర పెంచినందుకా..పెట్రోల్ ధర పెంచినందుకా…? ఎందుకు మోడీ దేవుడు సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. ఇక్కడ ఎంపి మసీదులు తవ్వుదాం అంటాడు…బొందల గడ్డలు తవ్వడానికా ఎంపి అయింది సంజయ్ ప్రజలకు సమాధానం చెప్పాలని అన్నారు. పునాదులు అభివృద్ధి కోసం తవ్వండి..అభివృద్ధి కోసం పునాదులు వేయండి..అది అభివృద్ధి అంటే అని బదులు ఇచ్చారు. మనను మోసం చేసేందుకు తెలంగాణలో ఎన్నికల ప్రచారం చేసేందుకు ఢిల్లీ నుంచి కాంగ్రెస్ రాహుల్ .. ప్రియాంక వస్తుంది..మోసపోకండి…కార్ గుర్తుకు ఓటు వేసి మళ్లీ సిఎం కెసిఆర్‌ని దీవించి హ్యాట్రిక్ విజయం అందించాలని ప్రజలను కోరారు.
గంగులపై పోటీ చేసేందుకు జంకుతున్నారు
కరీంనగర్‌లో మంత్రి గంగుల కమలాకర్ అన్నపై పోటీ చేసేందుకు అందరూ జంకుతున్నారని అన్నారు. కాంగ్రెస్ వాళ్లు హుస్నాబాద్ పారిపో యారని, బీజేపీ వాళ్ళు పోటీకి వెన్క ముందాడుతున్నారని విమర్శించారు. గంగుల మీద పోటీ అంటే పోషమ్మ గుడి.ముందు పొట్టేలు కట్టేసినట్టే అన్నారు.
నన్ను ఆదరించి.. ఆశీర్వదించడీ : మంత్రి గంగుల
కరీంనగర్ ప్రజల ఆశీర్వదంతో కౌన్సిలర్‌గా, కార్పొరేటర్‌గా , ఎమ్మెల్యేగా గెలిచాను..సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆశీర్వదంతో మంత్రిగా ఉ న్నా ఏ పదవిలో ఉన్నా ప్రజల మధ్యనే ఉన్నా..నన్ను మళ్లీ ఆదరించి ఆశీర్వదించి మరోసారి గెలిపించి బలం ఇవ్వండి అభివృద్ధిని కొనసాగించాలని కరీంనగర్ నియోజకవర్గ ప్రజలను కోరారు. కరీంనగర్ నియోజకవర్గ ప్రజలు వరుసగా 3సార్లు నన్ను గెలిపించారు…నాకంటే ముందు అనేకమంది ఎమ్మెల్యేలు.. మంత్రులు చేశారు కాని అభివృద్ధి శూన్యం అన్నారు. ఉమ్మడి రాష్ట్ర పాలనలో కోటి రూపాయలు నిధులు ఇవ్వమంటే ఇవ్వలేదు అని గుర్తు చేశారు. నేడు సీఎం కేసీఆర్ నిధులు రూ. 300 కోట్లతో కరీంనగర్ అభివృద్ధి చేసుకున్నాం అన్నారు. హిందూ ముస్లింలు కలిసి ఉంటేనే అభివృద్ధి జరుగుతుందన్నారు. ఇక్కడ మత సామరస్యాన్ని కాపాడమని అభివృద్ధి సాధించాం అన్నారు.
ఆంధ్ర నాయకులు బీజేపీ, కాంగ్రెస్ ముసుగు వేసుకుని వస్తున్నారని జాగ్రత్తగా ఉండాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బి. వినోద్ కుమార్, ఎమ్మెల్సీ భాను ప్రసాద్ రావు, ఎల్ రమణ, ఎమ్మెల్యేలు సుంకె రవిశంకర్, రసమయి బాలకిషన్, జడ్జీ చైర్‌పర్సన్ కనుమల్ల విజయ, కరీంనగర్ మేయర్ యాదగిరి సునీల్ రావు, సుడా చైర్మన్, జిల్లా బిఆర్‌ఎస్ అధ్యక్షుడు జివి రామకృష్ణా రావు, సివిల్ సప్లై రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్, మరో కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస్ , డిప్యూటి మేయర్ చల్ల స్వరూపరాణి హరిశంకర్, బిఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశకర్, పలువురు కార్పొరేటర్లు ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు , తదితరులు పాల్గొన్నారు