Friday, November 22, 2024

తెలంగాణ.. దేశం కడుపు నింపే స్థాయికి ఎదిగింది: మంత్రి కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ.. దేశం కడుపు నింపే స్థాయికి ఎదిగిందని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం ముగిసిన తర్వాత చర్చకు మంత్రి సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. తెలంగాణలో కరెంట్ కష్టం లేదు.. తాగునీటి తిప్పలు లేవు. సంక్షేమంలో రాష్ట్ర ప్రభుత్వానికి తిరుగులేదన్నారు. దేశ ప్రజల చూపు కెసిఆర్ వైపు ఉంటుందన్నారు. రాష్ట్రంలో నిధుల వరద పారుతోంది.. నియామకాల కల సాకారం అవుతోందన్నారు.

కేంద్ర ప్రభుత్వ అత్యుత్తమ 20 గ్రామ పంచాయతీలు ఎక్కడ ఉన్నాయంటే 9 తెలంగాణలోనే ఉన్నాయన్నారు. పల్లె పల్లెకు నిధులు పంపిణీ చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందని మంత్రి పేర్కొన్నారు. దేశంలోనే వ్యవసాయ ఉత్పత్తుల్లో తెలంగాణ మూడో స్థానంలో ఉందన్నారు. 2022లో 65 లక్షల ఎకరాల్లో వరి నాట్లు వేశారని చెప్పారు. 65 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.65 వేల కోట్లు జమ చేశాం. ఐక్యరాజ్యసమితి కూడా రైతుబంధును ప్రశంసించిందని మంత్రి కెటిఆర్ గుర్తుచేశారు. నల్ల చట్టాల ద్వారా 700 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారు. మోటర్లకు మీటర్లు ఎందుకు? అని ప్రశ్నించారు.

కెసిఆర్ అధికారంలోకి రాకముందు విద్యుత్ ఎలా ఉంది… ఇప్పుడు ఎలా ఉందో ఆలోచించుకోవాలన్నారు. గుజరాత్ లోని పరిశ్రమలకు పవర్ హాలిడేలు ఇస్తున్నారు. తెలంగాణలో పెండింగ్ ప్రాజెక్టులకు రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చాం అన్నారు. సిరిసిల్ల జిల్లా భూగర్భ జలాలు 6 మీటర్లకు పైకి వచ్చాయని కెటిఆర్ సభకు తెలిపారు. సాగునీటి రంగంలో తెలంగాణ గొప్ప విజయాలు సాధించింది. అటు మాంసం ఉత్పత్తిలో తెలంగాణ అగ్రస్థానంలో ఉంది. జాతీయ తలసరి సగటు మాంసం వినియోగం దేశంలో 5 కేజీలు ఉంటే తెలంగాణలో 21 కేజీలు ఉందన్నారు. అంగన్వాడీ ఉద్యోగులకు అత్యధిక వేతనం ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ అని మంత్రి కెటిఆర్ వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News