Wednesday, November 20, 2024

ఇ.ఇ.ఇ.. ఇన్నోవేషన్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఇన్‌క్లూజివ్ గ్రోత్

- Advertisement -
- Advertisement -
Minister KTR Speech In Assembly
ట్రిపుల్ ఐతో పారిశ్రామిక పరుగులు
పోటీ ప్రపంచంలో బతకాలంటే నిరంతరాయంగా నైపుణ్యాన్ని సమకూర్చుకోవాలి
అప్పు చేసిన ప్రతి రూపాయి ఉత్పాదక రంగంలో
ఖర్చు పెడుతున్నాం: కౌన్సిల్‌లో సభ్యుల ప్రశ్నలకు
ఇచ్చిన సుదీర్ఘ సమాధానంలో మంత్రి కెటిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్ : ఇన్నోవేషన్, ఇన్‌ఫాస్ట్రక్చర్, ఇన్‌క్లూజివ్ గ్రోత్ అనే మూడు సూత్రా ల ప్రాతిపదికన పారిశ్రామిక రంగాన్ని పరుగులు పెట్టిస్తున్నామని మంత్రి కెటిఆర్ తెలిపారు. శాసనమండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సుదీర్ఘంగా సమాధానమిచ్చారు. పోటీ ప్రపంచం లో బతకాలంటే స్కిల్, ఆఫ్‌స్కిల్, రీస్కిల్ పద్ధతిని అలవర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అధికారం ఎవరికి శాశ్వతం కాదు.. వ్యక్తు లు కాదు.. రాష్ట్రం శాశ్వతం.. ఈ ప్రాంతం శాశ్వ తం అని మంత్రి కెటిఆర్ పునరుద్ఘాటించారు. మూడున్నరేళ్లలోనే మిషన్ భగీరథను పూర్తి చేసి ఇంటింటికి తాగునీరు అందించామన్నారు. నాలుగేళ్లలో ప్రతిష్టాత్మకమై న కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించగలిగామన్నారు. అప్పు చేసి పప్పు కూడా తినడం లేదని మంత్రి కెటిఆర్ అన్నారు. అప్పు చేసిన ప్రతి రూపాయి ఉత్పాదక రంగంలో వెచ్చిస్తున్నామన్నారు. తద్వారా లక్ష కోట్లు పెడితే నాలుగు లక్షల కోట్ల ఆదాయం సమకూరుతుందన్నారు.

టిఎస్‌ఐపాస్ ద్వారా 17,302 పరిశ్రమలకు అనుమతులివ్వగా 13,000 పరిశ్రమలు ప ని ప్రారంభించినట్లు.. 15.99 లక్షల మందికి ఉపాధి లభించిందన్నారు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఐటిఐఆర్‌లపై మంత్రి కెటిఆర్ స్పందించారు. వీటి కోసం ఎంతగా ప్రయత్నించినా కేంద్రం నుంచి స్పందన అంతంతమాత్రమేనని అన్నారు. ఇక రైల్వే కోచ్ ఫ్యాక్టరీ విషయంలో పలుమార్లు కేంద్ర మంత్రుల వద్ద ప్రస్తావించామని, లేఖలు రాశామని వెల్లడించారు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వడం సాధ్యం కాదని కేంద్రం తెలిపిందని పేర్కొంటూనే మరోవైపు ఇంకో రాష్ట్రంలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ప్రారంభింపజేశారని కేంద్రంపై కెటిఆర్ ధ్వజమెత్తారు. రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమానికి సంబంధించి కేంద్రం ఎప్పటికప్పుడు ప్రశంసలు కురిపిస్తోంది తప్ప చిల్లి గవ్వ కూడా ఇచ్చిన పాపాన పోలేదని కెటిఆర్ ఆవేదన వెలిబుచ్చారు.

అయినా తాము వెనుదిరిగే ప్రసక్తి లేదని, దాదాపు వెయ్యి కోట్లతో రాష్ట్రంలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తున్నట్లు సభా ముఖంగా ప్రకటించారు. ఇందుకు వెయ్యి రూపాయలు పెట్టుబడి పెట్టేందుకు ఓ పారిశ్రామికవేత్త ముందుకు వచ్చారని వెల్లడించారు. త్వరలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ప్రారంభించనున్నట్లు సభాముఖంగా ప్రకటించారు. 201314లో తలసరి ఆదాయం 1.12 లక్షలైతే.. 2020లో 2.37 లక్షలుగా ఉందని పేర్కొన్నారు. కిటెక్స్ సంస్థలను సిరిసిల్లకు తీసుకెళ్తే బాగుండేదన్న ఎంఎల్‌ఎ జీవన్‌రెడ్డి అభిప్రాయానికి మంత్రి సరాదాగా సమాధానమిచ్చారు. టాటాలే కాదు.. తాతల నాటి కులవృత్తులను.. బిర్లాలే కాదు బోర్లాపడ్డ ఎంఎస్‌ఎంఈలను పైకి తీసుకురావటమే తెరాస ప్రభుత్వ లక్ష్యమని కెటిఆర్ వివరించారు.

ప్రపంచంలో టాప్ 5 దిగ్గజం కంపెనీలు వాటి రెండో అతి పెద్ద శాఖను తెలంగాణలో పెట్టాయంటే.. పరిశ్రమల పట్ల రాష్ట్ర ప్రభుత్వం సాధించిన ప్రగతి తెలుస్తోందన్నారు. టిహబ్ దేశంలోనే అతిపెద్ద టెక్నాలజీ ఇంక్యూబేటర్ అని అన్నారు. దేశంలో అందరికంటే ముం దు మనమే ప్రారంభించామన్నారు. దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారి ఐటి రంగంలో 2019 20 రెండు త్రైమాసికాల్లో బెంగుళూరును దాటినం అని తెలిపారు. ‘ఎబుల్ లీడర్‌స్టేబుల్ గవర్నమెంట్’ వల్లే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయని పెద్దలు చెబుతున్నారన్నారు. ఏరోస్పేస్ రంగంలోనూ పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయని వెల్లడించారు. అమెరికా అధ్యక్షుడు ఎక్కే హెలికాప్టర్ క్యాబిన్ నుంచి విమానాల లీప్ ఇంజన్లు ఆదిభట్లలో తయారవుతున్నాయన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News