Tuesday, January 21, 2025

ఇదే స్ఫూర్తితో మరింత ముందుకు పోవాలి: మంత్రి కెటిఆర్

- Advertisement -
- Advertisement -

Minister KTR Speech in Swachh Survekshan-2022 Awards

హైదరాబాద్: స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డులు- 2022 సాధించిన పురపాలికల ప్రజాప్రతినిధులు, కమిషనర్ల అభినందన కార్యక్రమంలో మంత్రి కెటిఆర్ మంగళవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డులు సాధించిన వారికి అభినందనలు తెలుపుతూ.. ఇదే స్ఫూర్తితో మరింత ముందుకు సాగాలన్నారు. దేశంలోనే అత్యధికంగా అవార్డులు సాధించి రెండవ స్థానంలో తెలంగాణ నిలిచిందని మంత్రి పేర్కొన్నారు.  ఈ అవార్డులు సాధించేందుకు కింది స్థాయిలో ఉన్న పారిశుద్ధ్య కార్మికురాలి నుంచి ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శిదాక అందరూ కలిసి ఒకే రకమైన ఆలోచన విధానంతో పనిచేయడం వల్లనే సాధ్యమైనది. జాతీయస్థాయిలో ఇంత గొప్ప గుర్తింపు లభించిందన్నారు. 20 ఉత్తమ గ్రామాల్లో 19 తెలంగాణలోనే ఉన్నాయని కేంద్రం చెబుతున్నది. పట్టణాలకు అవార్డులు ప్రకటిస్తే దేశంలో రెండో స్థానంలో తెలంగాణలో నిలిచింది. దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లోకెల్లా అత్యుత్తమమైన రాష్ట్రం తెలంగాణని కేంద్రమే చెబుతుందని కెటిఆర్ వెల్లడించారు. కానీ ఇక్కడ పరిపాలన సరిగా లేదని అబద్దాలను చెబుతుంది కూడా కేంద్రంలోని నాయకులే అని విమర్శింంచారు.

అయితే ఇలాంటి అర్థరహిత విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని అధికారులకు సూచించారు. ఒకవైపు అవార్డులు, రివార్డులతో పాటు ప్రజల ప్రశంసలు వస్తున్నాయి. తెలంగాణలో స్థానిక సంస్థల విధులను నిర్ణయించడం, నిధులు మంజూరు చేయడం వల్లనే ఇంత ప్రగతి సాధ్యమైందన్నారు. ప్రతి గ్రామంలో, మునిసిపాలిటీలో నర్సరీ ఉన్న ఏకైక రాష్ట్రము తెలంగాణ అని గర్వంగా చెప్పవచ్చన్నారు. ఈ రోజు తెలంగాణలోని పట్టణాలు, గ్రామాలు గొప్పగా మారాయని మంత్రి కెటిఆర్ తెలిపారు. స్థానిక సంస్థలు 50శాతం రిజర్వేషన్ వల్ల ఎంతో మంది అద్భుతమైన మహిళా నాయకులు పురపాలికలకు నాయకత్వం వహిస్తున్నారని చెప్పుకొచ్చారు. అద్భుతంగా పురోగతి సాధిస్తున్న గ్రామాలు పట్టణాలను ప్రోత్సహించాల్సిన బాధ్యత ఉన్నది. జాతీయస్థాయిలో స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డులు సాధించిన 19 పురపాలికకు రెండు కోట్ల చొప్పున ప్రోత్సాహకం అందిస్తున్నాం. ఈ నిధులను ప్రత్యేకంగా పారిశుధ్యం కోసం వినియోగించాలని విజ్ఞప్తి చేస్తున్నానని కెటిఆర్ తెలిపారు. అవార్డులు సాధించిన ఈ పంతొమ్మిది పురపాలికలకు చెందిన చైర్ పర్సన్లను ,కమిషనర్లను అడిషనల్ కలెక్టర్లను స్టడీ టూర్ కి పంపించి, మరిన్ని ఉత్తమ పద్ధతుల పైన అధ్యయనం చేసేందుకు అవకాశం కల్పిస్తామన్నారు. ఇందులోంచి పదిమందిని ఎంపిక చేసి జపాన్, సింగపూర్ కు అధ్యయనానికి పంపిస్తామని కెటిఆర్ స్పష్టం చేశారు. పట్టణాలను ప్రజలు మాది అని భావించినప్పుడే అవి అద్భుతంగా అభివృద్ధి సాధిస్తాయి. ఆ దిశగా ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించే కార్యక్రమాలను చేపట్టాలన్నారు.

అన్నీ పురపాలికల్లో 10 పాయింట్ ప్రోగ్రాం….

వెజ్ అండ్ నాన్ వెజ్ మాడల్ మార్కెట్స్, వైకుంఠధామం, డంప్ యార్డ్ ల బయో మైనింగ్, మాస్టర్ ప్లాన్, మడర్న్ దోభి ఘాట్, టీఎస్ బిపాస్, మానవ వ్యర్థాల ట్రీట్మెంట్ ప్లాంట్లు, గ్రీన్ బడ్జెట్ వంటి 10 లక్ష్యాలను సాధించడానికి ప్రయత్నం చేస్తున్నామని కెటిఆర్ అన్నారు. పారిశుధ్యం సరిగ్గా అమలుచేస్తే అవార్డులు అవే వెతుకుంటు వస్తాయి. ఎక్కడ పారిశుద్ధ కార్మికులకు 12 వేలకు తక్కువ జీతం ఉండరాదు. ఈ విషయం గమనించాలి. వారికి రక్షణ సామాగ్రి అందించాలని కెటిఆర్ ఆధికారులను ఆదేశించారు. వార్డు ఆఫీసర్ వ్యవస్థ ఏర్పాటు చేస్తాం… 3700 వార్డు ఆఫీసర్ల నియామకం చేస్తున్నామన్నారు. ఖాళీలు లేకుండా మునిసిపల్ సిబ్బంది నియామకం చేస్తున్నది. గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పుపై స్పందిస్తాము. స్టేట్ చేస్తున్న పారిశుధ్య నిర్వహణ కార్యక్రమల పైన మరింత సమగ్రంగా సమాచారం అందిస్తాం. ట్రిబ్యునల్ కు కొంత సమాచార గ్యాప్ ఉన్నట్టు ఉంది. మానవ వ్యర్థాల ట్రీట్మెంట్ ప్లాంట్లను అన్నీ పురపాలికల్లో ఏర్పాటు చేస్తున్నామని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News