Friday, November 22, 2024

ఎక్కడా అభివృద్ధి పనులు ఆగలేదు: మంత్రి కెటిఆర్

- Advertisement -
- Advertisement -

Minister KTR Speech In Telangana Assembly Live

హైదరాబాద్: పట్టణీకరణ వేగంగా జరుగుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని, పట్టణాల్లో గుణాత్మక మార్పు తెచ్చే దిశగా ప్రభుత్వం ముందుకెళ్తుందని మంత్రి కెటిఆర్ అన్నారు. పట్టణాల్లో మౌలిక వసతులు, జీవన ప్రమాణాల మెరుగుదలకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి చెప్పారు. ప్రతి నెలా ఠంచనుగా రూ.148 కోట్లు విడుదల చేస్తున్నమన్నారు. జిహెచ్ఎంసికి రూ.78 కోట్లు, పాలపాలికలకు రూ.70 కోట్లు విడుదల చేశామన్నారు. గతేడాది పురపాలికలకు రూ. 1.766 కోట్లు విడుదల చేశామని గుర్తుచేశారు. వచ్చే ఆరు నెలల్లో ప్రతి మున్సిపాలిటీల్లో ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్లను ఏర్పాటు చేస్తామన్నారు.

చెత్త సేకరించే వాహనాల సంఖ్యను 4,975కు పెంచామన్నారు. రూ.783 కోట్లతో నగరాల్లో పారిశుధ్య నిర్వహణ జరుగుతుందన్నారు. 71 పురపాలికల్లో మానవవ్యర్థాల శుద్ధి కేంద్రాల నిర్మాణం జరిగిందన్నారు. పట్టణాల్లో చెట్ల పెంపకం కోసం గ్రీన్ బడ్జెట్ ప్రవేశపెట్టామని కెటిఆర్ చెప్పారు. అర్బన్ మిషన్ భగీరథకు బడ్జెట్ లో రూ.800 కోట్లు కేటాయించామన్న కెటిఆర్  కరోనా సంక్షోభం ఉన్నా ఎక్కడా అభివద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఆగలేదన్నారు. వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేకంగా రూ. 250 కోట్లు, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ రూ. 150 కోట్లు కేటాయించామని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. టిఎస్ బి-పాస్ ద్వారా 21 రోజుల్లో భవన నిర్మాణానికి అనుమతులు ఇస్తున్నామని ఆయన తెలిపారు. ఎస్ఆర్ డిపి పేరిట హైదరాబాద్ లో రోడ్లను నిర్మిస్తున్నాం. కరోనా వ్యాక్సిన్ తయారీకి హైదరాబాద్ నగరం కేంద్రంగా మారింది. హైదరాబాద్ అభివృద్ధికి కేంద్రం నుంచి ఎలాంటి సాయం అందడంలేదని మంత్రి విమర్శించారు. పౌరులే కేంద్రంగా కొత్త మున్సిపల్ చట్టాన్ని తీసుకువచ్చామని ఆయన పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News