Friday, December 20, 2024

పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి కెటిఆర్ శ్రీకారం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మహబూబాబాద్ జిల్లాలో రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా కెటిఆర్ పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఆదివాసీలకు మంత్రి కెటిఆర్ పోడు భూముల పట్టాలను పంపిణీ చేశారు. మహబూబాబాద్ పట్టణంలో పేదల కోసం తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన 200 డబుల్ బెడ్‌రూం ఇండ్లను మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ లతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో శాసనమండలి చైర్మైన్ బండాప్రకాష్, ఎంపి మాలోతు కవిత, ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు డీఎస్. రెడ్యానాయక్, బానోతు శంకర్నాయక్, నన్నమనేని నరేందర్, చల్లా ధర్మారెడ్డి, ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ , ఎమ్మెల్సీలు బస్వ‌రాజ్ సారయ్య, టి. రవీందర్ రావు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News