Tuesday, December 24, 2024

కారోబార్ కుటుంబానికి అండగా నిలిచిన మంత్రి కెటిఆర్

- Advertisement -
- Advertisement -

సిరిసిల్ల ః ఇటీవల గుండెపోటుతో మృతి చెందిన సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల గ్రామ కారోబార్ ప్రభాకర్ (35) కుటుంబానికి అండగా ఉంటానని రాష్ట్ర ఐటి, పురపాలక శాఖల మంత్రి కెటిఆర్ అన్నారు. గురువారం సిరిసిల్ల నియోజక వర్గంలో రాష్ట్ర ఎస్‌సి, గిరిజన, బిసి, మైనార్టీ సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో కలిసి ఆయన పర్యటించిన సందర్భంగా బాబు జగజ్జీవన్ రామ్ వర్ధంతిని పురస్కరించుకుని సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెల్లలోని వ్యవసాయ కళాశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహన్ని ఆవిష్కరించడానికి మంత్రి కెటిఆర్ రాగా అక్కడ కారోబార్‌గా పనిచేస్తూ మృతి చెందిన ప్రభాకర్ భార్య జ్యోతి, పిల్లలు మంత్రి కెటిఆర్‌ను కలిసి తమ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు.

దాంతో ప్రభాకర్ మృతి బాధాకరమని, అనివార్య కారణాల వల్ల కుటుంబాన్ని పరామర్శించేందుకు రాలేక పోయానని వివరిస్తూ ప్రభాకర్ భార్య జ్యోతికి జిల్లెల్ల వ్యవసాయ కళాశాలలో ఉద్యోగం ఇప్పిస్తానని హమీ ఇచ్చారు.అక్కడే ఉన్న వ్యవసాయ కళాశాల ప్రిన్సిపల్ సెక్రెటరీ పిఎస్ శ్రీనివాస్‌కు జ్యోతి ఉద్యోగ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు.రెండు మూడు రోజుల్లో ఉద్యోగ నియామక పత్రాలు వస్తాయని, జిల్లెల్ల వ్యవసాయ కళాశాలలో పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకోమని సూచించారు. పిల్లల విద్యాభ్యాసానికి అయ్యే వ్యయాన్ని కూడా తామే భరిస్తామని తెలిపారు. దాంతో జ్యోతి, జిల్లెల్ల సర్పంచ్ మాట్ల మధు తదితరులు మంత్రి కెటిఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News