Thursday, January 2, 2025

రేప్‌లు చేసిన మైనర్లకు కూడా పెద్దలకు విధించే శిక్షలనే విధించాలి

- Advertisement -
- Advertisement -

Minister KTR Supports Hyderabad Police Decision

పోలీసుల నిర్ణయం సరైనదే : కెటిఆర్

హైదరాబాద్ : జూబ్లీహిల్స్‌లో మైనర్‌బాలికపై గ్యాంగ్ రేప్ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే ఈ కేసులో ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ కేసులో నిందితులుగా ఉన్న ఐదుగురు మైనర్లను మేజర్లుగా పరిగణించాలని జూబ్లీహిల్స్ పోలీసులు జువైనల్ కోర్టును కోరే యోచనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో మంత్రి కెటిఆర్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ పోలీసుల నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని చెప్పారు. అత్యాచారం వంటి అత్యంత దుర్మార్గమైన నేరాలకు పాల్పడే వారికి మేజర్లకు విధించే శిక్షలనే విధించాలన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News