భారీగా పెట్టుబడులు రప్పించడమే లక్ష్యం
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రానికి మరిన్ని భారీ పెట్టుబడులు తీసుకువచ్చే ప్రయత్నంలో భాగంగా తెలంగాణ ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారకరామారావుతో పాటు ఇతర ఉన్నతాధికారుల బృందం అమెరికా పర్యటనకు బయలుదేరింది. శనివారం ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరిన మంత్రి కెటిఆర్ అమెరికాలోని లాస్ ఏంజి ల్స్, శాన్ డియాగో, సానో హోజే, బోస్టన్, న్యూయార్క్ వంటి నగరాల్లో పర్యటించి అనేక కంపెనీల అధిపతులు, సీనియర్ ప్రతినిధి బృందాలతో సమావేశమవుతారు. రో జులకు పైగా కొనసాగనున్న ఈ పర్యటనలో ప్రపంచంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన పలు ఐటి, ఎలక్ట్రానిక్స్ ఫుడ్ ప్రాసెసింగ్, లైఫ్ సైన్సెస్, ఫార్మా రంగాల కంపెనీలతో సమావేశమవుతారు. గతంలో అమెరికాలో పర్యటించి పెద్దఎత్తున పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకువచ్చిన కెటిఆర్ ఈ పర్యటన ద్వారా మరిన్ని పెట్టుబడులను తెలంగాణకు తీసుకు వచ్చే అవకాశం ఉన్నది. మంత్రి కెటిఆర్‌తో పాటు పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, పరిశ్రమలు ఐటి శాఖకు చెందిన పలు విభాగాల డైరెక్టర్లు ఈ పర్యటనలో పాల్గొంటారు.