దారిలో మూడు రోజులపాటు లండన్ పర్యటన
ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొననున్న మంత్రి కెటిఆర్
లండన్‌లో, దాసోస్‌లో వివిధ కంపెనీల యజమానులు, సిఇఒలతో ప్రత్యేక సమావేశాలు దాసోస్‌లో రెండు రౌండ్‌టేబుల్ సమావేశాలు
ఫార్మా, ఫుడ్ ప్రాసెసింగ్, ఆటోమోటివ్ పరిశ్రమల ప్రతినిధులతో చర్చలు
మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారకరామారావు దావోస్ పయనమయ్యారు. ఈ నెల 22 నుం చి 26 వరకు స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగే ప్రపంచ ఆర్ధిక వేదిక సదస్సులో పాల్గొనేందుకు మంగళవారం ఉదయం పది గంటలకు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరారు. ముందుగా మూడు రోజుల పాటు ఆయన లండన్‌లో పర్యటించనున్నారు. ఈ మూ డు రోజుల్లో వివిధ కంపెనీలకు చెందిన అధిపతులు, సిఇఒలతో కెటిఆర్ ప్రత్యేకంగా సమావేశం అవుతారు. అనంతరం స్విట్జర్లాండ్‌కు వెళతారు. మొత్తం పది రోజుల పాటు సాగే తన పర్యటనలో రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తీసుకొచ్చేందుకు కెటిఆర్ కృషి చేయనున్నారు. ప్రపంచ ఆర్ధిక సదస్సులో ఆయన ఎమర్జింగ్ టెక్నాలజీస్ ద్వారా సామాన్యులకు మెరుగైన సేవలు అన్న అం శంపై ప్రసంగిస్తారు. ఈ పర్యటనలో అనేక ప్ర ఖ్యాత కంపెనీలతో సమావేశం కావడంతో పాటు రెండు రౌండ్ టేండ్ సమావేశాల్లో ఆయన పాల్గొంటారు.
అలాగే ప్రముఖ ఫార్మా, ఫుడ్ ప్రాసెసింగ్, ఆటోమోటివ్ పరిశ్రమలకు చెందిన ప్రతినిధులతో ఆయన ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 35 మంది వ్యాపార సారధులను కలవనున్నారు. కాగా దావోస్‌లో తెలంగాణకు అత్యాధునిక లాంజ్‌ను ఏర్పాటు చేసింది. ఇది అనేక మంది ప్రపంచ నాయకులకు ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ పర్యటనలో మంత్రి కెటిఆర్‌తో పాటు పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొంటారు.