Friday, November 1, 2024

ఉపాధి ప్రాజెక్టులను అడ్డుకోవద్దు

- Advertisement -
- Advertisement -

Minister KTR to inaugurate Batasingaram Logistic Park

హైదరాబాద్: హెచ్‌ఎండిఏ (హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ) అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటోంది. హెచ్‌ఎండిఏ ఆధ్వర్యంలో అభివృద్ధి ప్రణాళికలన్నీ ఒక్కోక్కటిగా రెడీ అవుతున్నాయి. అందులో భాగంగానే బాటసింగారంలో సిద్ధమైన లాజిస్టిక్ పార్కును మంత్రి కెటిఆర్ గురువారం ప్రారంభించారు. ఇప్పటికే హెచ్‌ఎండిఏ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న లాజిస్టిక్ పార్కులు ఒక్కోక్కటిగా అందుబాటులోకి వస్తున్నాయి. గతేడాది ఇబ్రహీంపట్నం మంగళపల్లి వద్ద పిపిపి (పబ్లిక్ ప్రైవేటు పార్టనర్ షిప్) పద్ధతిలో హెచ్‌ఎండిఏ ఏర్పాటు చేసిన లాజిస్టిక్ పార్కు అందుబాటులోకి రాగా, ఈ లాజిస్టిక్ పార్కు 22 ఎకరాలు సుమారు రూ.25 కోట్లతో నిర్మాణం జరిగింది.

ఇప్పుడు ఔటర్ రింగ్‌రోడ్డు వద్ద పెద్ద అంబర్‌పేట ఇంటర్‌ఛేంజ్‌కు సమీపంలో బాటసింగారం వద్ద మరో పార్కును హెచ్‌ఎండిఏ అందుబాటులోకి తీసుకొచ్చింది. హైదరాబాద్ టు విజయవాడ జాతీయ రహదారి సమీపంలోని 40 ఎకరాల్లో సుమారు రూ.40 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంది. లాజిస్టిక్ పార్కులకు అవసరమైన భూములను హెచ్‌ఎండిఏ అందించగా నిర్మాణానికి అవసరమైన నిధులను ప్రైవేటు సంస్థలు వెచ్చిస్తున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ఈ పార్కుల నిర్వహణ జరుగుతోంది. సరుకు రవాణా సాఫీగా సాగుతుండడంతో పాటు వందలాది మందికి దీనివల్ల ఉపాధి అవకాశాలు కలుగుతున్నాయి. ఔటర్ రింగ్‌రోడ్డు సమీపంలో బాటసింగారం వద్ద నిర్మించిన ఈ లాజిస్టిక్ పార్కును మంత్రి కెటిఆర్ ప్రారంభించారు.

10 వేల మెట్రిక్ టన్నుల సామర్థం కలిగిన శీతల గిడ్డంగులు

దేశ నలుమూలల నుంచి వచ్చే సరుకు రవాణా వాహనాలకు అవసరమైన అన్నిరకాల సేవలను అందించడమే లక్షంగా లాజిస్టిక్ పార్కులను అత్యున్నత ప్రమాణాలతో నిర్మించాలని హెచ్‌ఎండిఏ నిర్ణయించింది. హై సెక్యూర్టీ విధానంతో 24 గంటల పాటు సేవలందించేలా నిర్వహణ వ్యవస్థ పనిచేస్తుంది. మినీగోడౌన్స్, వసతి సౌకర్యం, ఆరోగ్య సంరక్షణ వంటివి లాజిస్టిక్ పార్కులో అందుబాటులో ఉంటాయి. ఒకేసారి 5 వందల ట్రక్కులు నిలిచేందుకు 2 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని ఏర్పాటు చేశారు. 10 వేల మెట్రిక్ టన్నుల సామర్థం కలిగిన శీతల గిడ్డంగులను నిర్మించారు. డ్రైవర్ల కోసం విశాంత్రి గదులు, పెట్రోల్ పంపు, రెస్టారెంట్ వంటి సౌకర్యాలు కూడా ఈ పార్కులో ఉండనున్నాయి. కమర్షియల్ స్పేస్ 5 వేల ఎస్‌ఎఫ్‌టి, పెట్రోల్ పంపు 1, వెహికల్ టెస్టింగ్ సెంటర్‌ల నిర్మాణాలు ఇక్కడ జరిగాయి. మొత్తంగా లాజిస్టిక్ పార్కుల నిర్మాణంతో ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుండగా, మరోవైపు ఉపాధితో పాటు నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గనున్నాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News