Monday, December 23, 2024

దెబ్బతిన్న ధాన్యం మొత్తాన్ని కొనుగోలు చేస్తాం: మంత్రి కెటిఆర్

- Advertisement -
- Advertisement -

ముస్తాబాద్: రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రి కెటిఆర్ మంగళవారం పర్యటిస్తున్నారు. ముస్తాబాద్ లో వడల్ల కొనుగోలు కేంద్రాన్ని కెటిఆర్ పరిశీలించారు. ముస్తాబాద్ మండలం గోపాలపల్లిలో పంటనష్టాన్ని పరిశీలించారు. అకాల వర్షాలకు తడిసిన ధాన్యం కుప్పలను రైతులు మంత్రి కెటిఆర్ కు చూపించారు. దెబ్బతిన్న ధాన్యం మొత్తాన్ని కొనుగోలు చేస్తామని మంత్రి రైతులకు హామీ ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు రైతులు కష్టపడి పండించిన ధాన్యం నీటిపాలైంది. దీంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News