Friday, December 27, 2024

వరంగల్‌ జిల్లాలో మంత్రి కెటిఆర్‌ పర్యటన

- Advertisement -
- Advertisement -

Minister KTR Tour in Warangal District

గీసుకొండ: వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలో మంత్రి కెటిఆర్ శనివారం పర్యటిస్తున్నారు. హవేలీలో కైటెక్స్ టెక్స్ టైల్స్ పార్కుకు కెటిఆర్ భూమిపూజ చేశారు. మిషన్ భగీరథ ట్యాంక్ పనులకు శంకుస్థాపన చేశారు. గణేష్ ఎకో పెట్ టెక్స్ టైల్ ఇండస్ట్రీ ప్రారంభోత్సవంలో మంత్రి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ…. విమర్శలు చేయడమే కాంగ్రస్ పనిగా పట్టుకుందని తెలిపారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ చాలా మాట్లాడారన్నారు. బిజెపి పాలిత రాష్ట్రాల్లో రైతు బీమా ఉందా? అని ప్రశ్నించారు. సిలిండర్ ధర రూ. 400 నుంచి రూ.1050కి పెరిగిందని కెటిఆర్ పేర్కొన్నారు. సిలిండర్ ధరపై మాత్రం బిజెపి నేతలు మాట్లాడరని ఎద్దేవా చేశారు. అందరిలా కాదు… మేము చేసిన పని మాత్రమే చెబుతామని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News