హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ రాష్ట్ర ఐటిపురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, పసుపు బోర్డు ఇవ్వనని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పిన విషయాన్ని మంత్రి గుర్తుచేశారు. రాష్ట్రానికి మెట్రో రెండోదవ లేదని ప్రధాని చెప్పారన్నారు. ఐటిఐఆర్, గిరిజన యూనివర్సిటీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, రాష్ట్ర ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చేది లేదు, తెలంగాణకు ఏదీ ఇచ్చేది లేదని మోడీ సర్కార్ చెప్పిందని కెటిఆర్ మండిపడ్డారు. ప్రధాని ప్రాధాన్యతల్లో.. అసలు తెలంగాణే లేనప్పుడు.. తెలంగాణ ప్రజల ప్రాధాన్యతా క్రమంలో ప్రధాని ఎందుకు ఉండాలి..? అని మంత్రి కెటిఆర్ ప్రశ్నించారు. తెలంగాణలో ఆ దిక్కుమాలిన పార్టీ ఎందుకుండాలని ఆయన విమర్శించారు.
తెలంగాణకు…
కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వం – ప్రధాని
పసుపు బోర్డు ఇవ్వం – ప్రధాని
మెట్రో రెండో దశ ఇవ్వం – ప్రధాని
ఐటిఐఆర్ ప్రాజెక్టు ఇవ్వం – ప్రధాని
గిరిజన యూనివర్సిటీ ఇవ్వం – ప్రధాని
బయ్యారం ఉక్కుఫ్యాక్టరీ ఇవ్వం – ప్రధాని
ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వం – ప్రధానిప్రధాని…
— KTR (@KTRBRS) March 30, 2023