Saturday, December 28, 2024

అమిత్ షా పర్యటనను ఉద్దేశించి మంత్రి కెటిఆర్ ట్వీట్

- Advertisement -
- Advertisement -

Minister KTR Tweet On Amit Shah

హైదరాబాద్: కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై తెలంగాణ ఐటి శాఖ మంత్రి కెటిఆర్ తన ట్విట్టర్ ద్వారా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు అమిత్ షా హైదరాబాద్ వచ్చిన అనంతరం మంత్రి కెటిఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. భారతదేశానికి విభజన రాజకీయాలు కాదు నిర్ణయాత్మక విధానాలు అవసరమని మంత్రి కెటిఆర్ అన్నారు. విమోచన దినం సందర్భంగా రాష్ట్ర పర్యటనకు వచ్చిన అమిత్ షా పర్యటనను ఉద్దేశించి ట్వీట్ చేశారు. “74 సంవత్సరాల క్రితం అప్పటి హోంమంత్రి తెలంగాణ ఇండియన్ యూనియన్‌లోకి విలీనం చేయడానికి వచ్చారు. ఇవాళ వచ్చిన కేంద్ర హోంమంత్రి తెలంగాణ ప్రజలను, ప్రభుత్వాన్ని విభజించి, బెదిరించే ప్రయత్నం చేశారు” అని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News