అనంతగిరి ప్రాజెక్టు పర్యాటక కేంద్రమని ట్విట్టర్‌లో మంత్రి కెటిఆర్ పోస్ట్
ఇల్లంతకుంట: తెలంగాణలో బంజరు భూములను సాగు భూములుగా తయారు చేయాలనే సంకల్పంతో ‘కాళేశ్వరం ప్రాజెక్టు’ నిర్మించడం జరిగిందని, దానితో పాటుగా సాగు నీరు కోసమే కాకుండా అన్నపూర్ణ రిజర్వాయర్ (అనంతగిరి ప్రాజెక్టు) పర్యాటక కేంద్రంగా మారిందని రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామరావు తన ట్విట్టర్ ఖాతాలో ప్రశంసలతో కూడిన పోస్ట్ చేశారు. హైద్రాబాద్ నుండి రెండు గంటల ప్రయాణం చేస్తే రాజన్నసిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం అనంతగిరి గ్రామంలోని ‘అన్నపూర్ణ రిజర్వాయర్’ కు చేరుకోవచ్చన్నారు. ఎంతో ఆహ్లాదకరమైన, అందమైన పర్యాటక ప్రదేశమని ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. మంత్రి కేటిఆర్ ట్విట్టర్‌లో అనంతగిరి రిజర్వాయర్ జలకళను సంతరించుకుని ఉన్న ఫోటోను పోస్ట్ చేయడంతో మండల ప్రజలు , ప్రజా ప్రతినిధులు, అనంతగిరి గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రిజర్వాయర్ 2.5 టిఎంసిల నీటిని నీల్వ చేసినట్లు నీటి పారుదల శాఖ అధికారులు తెలిపారు.
Beautiful, idyllic & nature at its best
Annapurna reservoir at Ananthagiri in Illantakunta Mandal of Rajanna Siricilla district, 2 hours from Hyderabad #KaleshwaramProject not only irrigates barren lands of Telangana but also has created huge tourist attractions 👇 pic.twitter.com/zhQPs4fyp4
— KTR (@KTRTRS) June 30, 2021