Wednesday, January 22, 2025

ఆకాశంలో సగం కాదు.. “ఆమే” ఆకాశం…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా మహిళా సంక్షేమ దినోత్సవ వేడుకలతో సందడి నెలకొంది. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మహిళలకు రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు. మహిళా సంక్షేమం పట్ల తెలంగాణ ప్రభుత్వం అకుంఠిత దీక్షను పునరుద్ఘాటించిన ఆయన, ఈ విషయంలో తెలంగాణ యావత్ జాతికి రోల్ మోడల్‌గా నిలుస్తుందని ఉద్ఘాటించారు.

కుటుంబాల్లో కీలకపాత్రలు పోషిస్తూ రాష్ట్రాభివృద్ధికి, దేశాభివృద్ధికి చేస్తున్న అపారమైన కృషి వరకు మహిళలు ఎన్నో సానుకూలమైన సహకారాన్ని అందించారని మంత్రి కేటీఆర్‌ కొనియాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వం ప్రతి విషయంలోనూ మహిళల హక్కులు, శ్రేయస్సును కాపాడేందుకు కట్టుబడి ఉందని ఆయన నొక్కి చెప్పారు.

మహిళా సంక్షేమ దినోత్సవాన్ని పురస్కరించుకుని కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా వరుస ట్వీట్ల ద్వారా తన మనోభావాలను వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళలు తమ సాధికారత కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న తిరుగులేని మద్దతును అభినందిస్తున్నారని తెలిపారు. శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళలకు మంత్రి తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News