Saturday, April 12, 2025

మహింద్రా సంస్థ తయారుచేసిన 3,00,001వ ట్రాక్టర్ ను ఆవిష్కరించిన కెటిఆర్

- Advertisement -
- Advertisement -

Minister KTR unveiled Mahindra tractor

మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ మహీంద్రా తన 3,00,001వ ట్రాక్టర్‌ను తెలంగాణలోని ప్లాంట్‌లో తయారుచేసింది. ఈ సందర్భంగా జహీరాబాద్‌లోని మహీంద్రా ప్లాంట్‌లో ప్రత్యేకంగా కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ మహీంద్రా 3,00,001వ ట్రాక్టర్ ను ఆవిష్కరించారు. అనంతరం దాన్ని నడిపారు. ఈ విషయాన్ని కెటిఆర్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. ‘హేయ్… ఆనంద్ మహీంద్రా జీ… నన్ను చూడండి… మీ ఉత్పత్తులకు ఎంత చక్కగా ప్రచారం కల్పిస్తున్నానో! అందుకని మీరు మా రాష్ట్రంలో మరిన్ని పరిశ్రమలు స్థాపించాల్సి ఉంటుంది‘ అంటూ మహీంద్రా అధినేత ఆనంద్ మహీంద్రాను ఉద్దేశించి చమత్కరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News