Wednesday, January 22, 2025

ఎంఎల్‌సి ఎల్ రమణను పరామర్శించిన మంత్రి కెటిఆర్

- Advertisement -
- Advertisement -

జగిత్యాల ః ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థానిక సంస్థల ఎంఎల్‌సి ఎలగందుల రమణ తండ్రి ఎల్.జి రాం ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి, బిఆర్‌ఎస్ పార్టీ కార్యానిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు రమణ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఎల్.జి రాం ద్వాదశ దినకర్మ సందర్భంగా ఆదివారం హైదరాబాద్ నుంచి జగిత్యాలకు చేరుకుని ఎల్.జి రాం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

రమణ, కుటుంబ సభ్యులకు మంత్రి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా కెటిఆర్ వెంట జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్ దావ వసంత, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ చంద్రశేఖర్‌గౌడ్ తదితరులున్నారు. అంతకుముందు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్, జెడ్‌పి చైర్‌పర్సన్ వసంత, ప్రజాప్రతినిధులు కెటిఆర్‌కు పుష్పగుచ్చాలు అందించి ఘన స్వాగతం పలికారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News