హైదరాబాద్ : టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్ బుధవారం రాజన్న సిరిసిల్లా జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 11:00 గంటలకు జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండలం, రాచర్లబొప్పాపూర్కు చేరుకుంటారు. అక్కడ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ప్రారంభోత్సవం చేస్తారు. అనంతరం ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లిలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ప్రారంభిస్తారు. కార్యక్రమం ముగిసిన తరువాత డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల లబ్ధిదారులతో కలిసి సహాపంక్తి భోజన కార్యక్రమంలో పాల్గొంటారు.మధ్యాహ్నం 1:30 గంటలకు సిరిసిల్ల పట్టణంలో ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నిర్మాణానికి శంఖుస్థాపన చేస్తారు. తదనంతరం ఆర్డిఒ కార్యాలయం ఆవరణంలో డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రారంభిస్తారు.
అలాగే వేములవాడ 100 పడకల ఆసుపత్రిలో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ల వితరణ కార్యక్రమంలో పాల్గొంటారు. బోయినిపల్లి మండలం కొదురుపాక జంక్షన్ వద్ద రోడ్డు వెడల్పు కార్యక్రమానికి శంకుస్థాపన చేసిన అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన రైతువేదికను ప్రారంభిస్తారు. అలాగే కెడిసిసి బ్యాంకును కూడా మంత్రి కెటిఆర్ ప్రారంభిస్తారు. అనంతరం బోయినిపల్లి మండలం విలాసాగర్లో సాగునీటి ఎత్తిపోతల లిఫ్ట్ ప్రారంభోత్సవం చేస్తారు. ఈ కార్యక్రమంలో ట రహదారులు భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడి, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్తో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొంటారు.