Wednesday, January 22, 2025

సిరిసిల్ల బిసి స్టడీ సర్కిల్‌ను సందర్శించిన మంత్రి కెటిఆర్

- Advertisement -
- Advertisement -

Minister KTR visit Sircilla BC Study Circle

హైదరాబాద్:  తెలంగాణ ఐటి,పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ రాజన్న సిరిసిల్లలోని బీసి స్టడీ సర్కిల్ ను శుక్రవారం సందర్శించారు. అభ్యర్థులకు రూ.2 లక్షల రూపాయల స్టడీ మెటీరియల్ ను మంత్రి కెటిఆర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మట్లాడారు. త్వరలోనే జిల్లా కేంద్రంలో శాశ్వత బిసి స్టడీ సర్కిల్ భవనం నిర్మిస్తామన్నారు. సిరిసిల్లలో 500 మందికి శిక్షణ ను ఎస్సీ స్టడీ సర్కిల్ లో శిక్షణ ఇస్తున్నాం. 500 మందికి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో శిక్షణ ను సినారె కళా మందిరంలో శిక్షణ ఇస్తున్నాం. 1000 పై చిలుకు మందికి ఉచిత శిక్షణ, స్టడీ మెటీరియల్ అందిస్తున్నామని స్పష్టం చేశారు. మరో 134 స్టడీ సర్కిల్ లను సిఎం కెసిఆర్ మంజూరు చేశారు. తెలంగాణ ఏర్పాటై 8 ఏండ్లు అయ్యింది. నిధులు, నీళ్ళు, నియామకాలు కోసమే ఉద్యమం జరిగింది. గోదావరి, కృష్ణా జలాలు, 60 వేల పైగా చెరువులు ఉండే. చిత్త శుద్ధి లేని నాయకత్వం వల్ల సాగు, త్రాగు జలాలకు ఇబ్బంది ఉండే. సిరిసిల్ల, వేములవాడ దుర్భిక్ష ప్రాంతాలు ఉండేవి. సాగు జలాలు అటుంచి త్రాగు జలాలకు గోస పడే పరిస్థితులు ఉండేవి. బోర్లు వేసి బొక్క బోర్లా పడ్డ తెలంగాణ, సాగు త్రాగు నీరు రంగంలో స్వయం సమృద్ధo చేశామని మంత్రి తెలిపారు.

75 ఏండ్లలో ఎవ్వరూ చేయని పని మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ త్రాగు నీరు ఇచ్చామన్నారు. 40 కోట్ల ఎకరాల సాగుకు యోగమైన భూమి ఉంది. 70 వేల టీఎంసీల నీరు నదుల లలో అందుబాటులో ఉంది. ఒక టిఎమ్ సితో 10 వేల ఎకరాల కు సాగు నీరు. ఒక పక్క సమృద్దిగా నీరు, మరో పక్క దుర్భిక్ష ప్రాంతాలు. పాలకులకు సోయి లేక పోవడం వల్లే ఈ పరిస్థితి. తెలంగాణ ఏర్పాటయ్యాక మిషన్ కాకతీయ, కాళేశ్వరం, సహా అనేక ప్రాజెక్ట్ లు కట్టామన్నారు. తెలంగాణ దేశంలోనే ధాన్యపు భాండగారం అయ్యింది.  జిల్లాలో మధ్య మానేరు జలాశయం, అన్న పూర్ణ కట్టాo. సాగునీటిలో రాజన్న సిరిసిల్ల జిల్లా స్వయం సమృద్దం అయింది. శిక్షణ ఐఏఎస్ లకు రాజన్న సిరిసిల్ల జిల్లా లో 6 మీటర్లు పెరిగిన భూగర్భ జలం ఓ పాఠంగా మారింది. 2014 తెలంగాణ వచ్చిన కొత్తలో తలసరి ఆదాయం 1,24,000. ఇప్పుడు తెలంగాణ తలసరి ఆదాయం 2,78,000 కు పెరిగింది. 130 శాతం పెరిగింది.ఇది రిజర్వ్ బ్యాంక్ తెలిపిన లెక్కలు అని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News