Monday, December 23, 2024

కేంద్రంలో సంకీర్ణం.. మనమే కీలకం

- Advertisement -
- Advertisement -

భూదాన్‌ పోచంపల్లి: మాది చేతల ప్రభుత్వం..చేనేతల ప్రభుత్వమని చేనేత కార్మికుల రుణ మాఫీ కోసం కృషి చేస్తామని హైండ్లూమ్ జౌళీ ఐటి పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. పోచంపల్లి మున్సిపల్ కేంద్రంలో పద్మశాలీ మహాజనసంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నేతన్న విగ్రహంను శనివారం ఆవిష్కరించారు. ఈసందర్బంగా స్థానిక బాలాజీపంక్షన్‌లులో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సభలో మాట్లాడారు. చేనేత కార్మికుల కష్టాలు తెలిసిన ముఖ్యమంత్రి కేసిఆర్ చేనేత కార్మికులకు చేయూత నిచ్చి అభివృద్దికి దోహదంచేసే త్రిప్టుపథకంతో పాటు తొమ్మిది సంక్షేమపథకాలు ప్రవేషపెట్టారని తెలిపారు. అలాగే మండలంలోని కనుముక్కల గ్రామంలో గల దివాలతీసి మూతపడిన పోచంపల్లి హైండ్లుమ్ పార్కును ఇటీవలే 12.50 కోట్లకు ప్రభుత్వం కొనుగోలు చేసిందని మరో15కోట్లతో హైండ్లుమ్ పార్కును అభివృద్దిచేసి స్థానిక చేనేత కార్మికుల కుటుంబాలకు లబ్దిజరిగేలా చర్యలు తీసుకుంటామని అన్నారు.

జియో ట్యాగింగ్ గల చేనేత కార్మికులకు ప్రతి నెల 3 వేల రూపాయలు వారి ఖాతాలో జమచేస్తామని, హెల్త్ కార్డులను ప్రభుత్వం ప్రవేశపెట్టిన గుర్తింపు కార్డులతోపాటు చేనేత కార్మికులకు గుంట మగ్గాల స్థానంలో ప్రభుత్వం అందించే ఆదునిక ప్రేమ్ మగ్గాలతో లబ్ది పొందాలని అన్నారు. చేనేత కార్మికులు కోరిన విధంగా స్థానిక హైండ్లూమ్ సొసైటీల ఎన్నికలు నిర్వహిస్తామని అన్నారు. ఆనాడు ఉద్యమ నాయకుడిగా ఉన్న కేసిఆర్ కష్టాల్లో పస్తులుంటున్న చేనేత కార్మికులను ఆదుకునేందుకు కేసిఆర్ జొలెపట్టి పోచంపల్లి లో ఐదు పదివేలతో చేనేత కార్మికుల కుటుంభాలను ఆదుకున్నాడని మంత్రి గుంతకండ్ల జగదీశ్వర్ రెడ్డి అన్నారు. అంతకుముందు పోచంపల్లి లో రెండు కోట్ల నిధులతో నిర్మించనున్న వెజ్, నాన్‌వెజ్ మార్కెటు, దోబిఘాట్, సిసిరోడ్లు, డ్రేనేజీలు, చేనేత మార్కెట్ నిర్మాణ పనులకు శంకుస్తాపనలు చేసారు. ఈకార్యక్రమంలో ప్రభుత్వ విప్ గొంగిడి సునిత మహేందర్ రెడ్డి, జడ్పిచైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ చిట్టిపోలు విజయలక్ష్మిశ్రీనివాస్,

ఎమ్మెల్యేలు గాదరి కిషోర్, చిరుమర్తి లింగయ్య, కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎల్ రమణ, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎంపిపి మాడ్గుల ప్రభాకర్‌రెడ్డి, హైండ్లూమ్ సెక్రేటరి బుద్దప్రకాష్ జ్యోతి, హైండ్లూమ్ బోర్డు డైరెక్టర్ అలుగు వర్షిని, జిల్లా కలెక్టర్ వినయ్ క్రిష్ణా రెడ్డి, అడిషనల్ కలెక్టర్ విరారెడ్డి, భాస్కర్ రావు, హైండ్లూమ్ కార్పోరేషన్ టిస్కొ చింత ప్రభాకర్, గూడూరు ప్రవీన్, వెంకటేషం, జడ్పిటీసీ సభ్యులు కొట పుష్పలత మల్లారెడ్డి, బత్తుల మాధవి శ్రీశైలం, టై&డై అధ్యక్షులు తడ్క రమేష్, వైస్ ఎంపిపి పాక వెంకటేష్, మండలపార్టీ అధ్యక్షులు పాటి సుధాకర్‌రెడ్డి, కార్యదర్శి చిలువేరు బాల్ నర్సింహా, తహసిల్దార్ వీరాబాయి, ఆర్‌ఐ వెంకట్‌రెడ్డి, చేనేత నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News