Wednesday, January 22, 2025

నేడు మహబూబ్‌నగర్‌ జిల్లాకు మంత్రి కెటిఆర్‌

- Advertisement -
- Advertisement -

Minister KTR Visit To Mahabubnagar District today

హైదరాబాద్: తెలంగాణ ఐటి,పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ శనివారం మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించనున్నారు. పేరూరు ఎత్తిపోతల పథకానికి, వర్నే-మత్యాలంపల్లి రోడ్డుపై వంతెనకు,భూత్పూర్ లో మిని స్టేడియం నిర్మాణానికి, సమీకృత వెజ్-నాన్ వెజ్ మార్కెట్ కు, మంత్రి కెటిఆర్ నేడు శంకుస్థాపన చేయనున్నారు. గుడిబండకు బిటీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించనున్నారు. అమిస్తాపూర్ రెండు పడక గదుల గృహ ప్రవేశంలో పాల్గొనున్నారు. అనంతరం అమిస్తాపూర్ సమీపంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగసభలో పాల్గొని ప్రసగించనున్నారు. వేములలో కోజెంట్ కంపెనీ ఐదో యూనిట్ ను మంత్రి  ప్రారంభించనున్నారు. కోస్గి పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. కోస్గిలో సమీకృత వెజ్-నాన్ వెజ్ మార్కెట్ కు, పంచతంత్ర పార్క్ ఏర్పాటుకు మంత్రి కెటిఆర్ శంకుస్థాపన చేయనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News