- Advertisement -
సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రి కెటిఆర్ గురువారం పర్యటిస్తున్నారు. భారీ వర్షాలపై సిరిసిల్ల కలెక్టరేట్ లో మంత్రి సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని 666 చెరువుల పరిస్థితిపై కెటిఆర్ అధికారులను ఆరా తీశారు. అన్ని చెరువులు పటిష్టంగా ఉన్నాయని కెటిఆర్ కు అధికారులు తెలిపారు. ఎన్నడూ లేనివిధంగా ఈ నెలలో అత్యధిక వర్షపాతం నమోదైందని మంత్రి పేర్కొన్నారు. సాధారణం కంటే 450 శాతం ఎక్కువ వర్షపాతం నమోదైందన్నారు. అధికారయంత్రాంగం ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా చూడాలన్నారు. మున్సిపాలిటీ సహా అన్ని గ్రామాల్లో భద్రతా అడిట్ జరగాలని చెప్పారు. నిర్మాణ పనులు జరిగే చోట హెచ్చరిక సంకేతాలు పెట్టాలన్నారు. శిథిలావ్యవస్థలో ఉన్న ఇళ్లను తక్షణం ఖాళీ చేయించాలని మంత్రి పేర్కొన్నారు.
- Advertisement -