Monday, December 23, 2024

అక్టోబర్ 4న బాన్సువాడలో మంత్రి కెటిఆర్ పర్యటన

- Advertisement -
- Advertisement -

బాన్సువాడ: రాష్ట్ర ఐటి, మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అక్టోబర్ 4న బాన్సువాడలో పర్యటించనున్నారు. దానికి సంబంధించిన ఏర్పాట్లను సోమవారం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి పరిశీలించారు. కెటిఆర్ చేతుల మీదుగా చిల్డ్రన్స్ పార్కు, మల్టీ జనరేషన్ పార్కు, అంబేద్కర్ భవనం, బాబు జగ్జీవన్ రాం విగ్రహం ఏర్పాటు, ఆర్డీవో కార్యాలయం, మున్సిపల్ కార్యాలయం, పట్టణంలో ఏర్పాటు చేయనున్న ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాట్లు, హెలిప్యాడ్ స్థలం, బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇప్పటికే 95 శాతం పనులు పూర్తయ్యాయని,

మిగతా పనులను ఈ నెలాఖరు వరకు పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్దంగా ఉంచాలని సంబంధిత కాంట్రాక్టర్లకు సూచించామన్నారు. త్వరలోనే పనులు పూర్తి చేసుకుని కెటిఆర్ చేతుల మీదుగా ప్రారంభోత్సవానికి ముస్తాబు చేసి పర్యటనను విజయవంతం చేయనున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ ఆర్డీవో భుజంగ్ రావు, మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు అంజిరెడ్డి, మున్సిపల్ కమీషనర్ రమేష్ కుమార్, డీఎస్పీ జగన్నాథ రెడ్డి, సిఐ మహేందర్ రెడ్డి, నాయకులు దొడ్ల వెంకట్రాం రెడ్డి,  నాయకులు తదితరులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News