Monday, December 23, 2024

అందరికీ ఐటి ఫలాలు

- Advertisement -
- Advertisement -

Minister KTR visits Nalgonda

నల్లగొండ రూపురేఖలు మారుస్తాం, ప్రతి 2నెలలకోసారి వచ్చి అభివృద్ధి పనులపై సమీక్షిస్తా
ఫ్లోరైడ్ భూతాన్ని రూపుమాపింది మేమే, కెసిఆర్ నాయకత్వంలో ప్రగతిపథంలో రాష్ట్రం : మంత్రి కెటిఆర్
ఐటి హబ్, సమీకృత వెజ్, నాన్‌వెజ్ మార్కెట్‌కు శంకుస్థాపన, ప్రభుత్వ పాలిటెక్నిక్ బాలుర వసతి గృహం ప్రారంభం,
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మంత్రులు జగదీశ్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డిలతో కలిసి జిల్లా కేంద్రంలో కలియతిరిగిన కెటిఆర్

మనతెలంగాణ/నల్లగొండ : రానున్న సంవత్సరంన్నర కాలంలో అభివృద్ధి పరంగా నల్లగొండ పట్టణ రూపురేఖలు మార్చుతామని, ఇందుకు అనుగుణంగా పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతామని రాష్ట్ర పురపాలన, పట్టణ అభివృద్ధి, పరిశ్రమలు, ఐటి శాఖమంత్రి కె. తారక రామారావు అన్నారు . శుక్రవారం నల్లగొండ పట్టణంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి. జగదీశ్వర్‌రెడ్డి , రాష్ట్ర రహదారులు , భవనాలు , గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డితో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నారు. నల్లగొండ పట్టణంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజిలో 3కోట్ల రూపాలయల అంచనాలతో నిర్మించిన ఎస్‌సి , ఎస్‌టి బాలుర వపతి గృహ భవనాన్ని ప్రారంభోత్సవం, మొదటి దశలో 3 ఎకరాల స్థలంలో 50కోట్ల రూపాయలతో 75 వేల చదరపు ఆడుగులలో నిర్మించనున్న ఐటి హబ్‌కు మంత్రులు కెటిఆర్, జగదీశ్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డిలు శంకుస్థాపన చేశారు. బీట్ మార్కెట్‌లో 3కోట్ల 80 లక్షల రూపాయలతో నిర్మించనున్న సమీకృత, వెజ్ , నాన్‌వెజ్ మార్కెట్‌కు శంకుస్థాన చేశారు.

పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు నల్లగొండ పట్టణంలో సహచర మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డితో కలిసి పర్యటిస్తున్నట్లు తెలిపారు. నల్లగొండ అభివృధ్ధికి 100కోట్ల రూపాయలు ప్రకటించి30కోట్ల రూపాయలు విడుదల చేసినట్లు , రూ.70 కోట్లు విడుదల చేసి పట్టణంలో రహదారులు , జంక్షన్‌లు ఏర్పాటు, మౌలిక వసతులు కల్పించనున్నట్లు తెలిపారు. పట్టణంలో పేద ప్రజలకు 5 బస్తీ దవాఖానాలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. 3కోట్ల, 80 లక్షల రూపాయలతో వెజ్, నాన్‌వెజ్ మార్కెట్, 3కోట్ల రూపాయలతో రెండు వైకుంఠధామంలు నిర్మించనున్నట్లు తెలిపారు. యువతకు ఉపాధి కల్పించే కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. స్థానిక శాసన సభ్యులు కోరిన ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటుపై ముఖ్యమంత్రి , సంబంధిత మంత్రి దృష్టికి తీసుకువెళతానని తెలిపారు. కొవిడ్ కారణంగా కొంత పనులు మందగించినట్లు , మళ్లీ రెండు నెలలకు నల్లగొండ వస్తానని పనులు సమీక్ష చేస్తానని తెలిపారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను ,అన్ని రంగాలను సమతుల్యతతో అభివృద్ధి పరుస్తూ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నాయకత్వంలో రాష్ట్రం ప్రగతిపథంలో ముందుకు వెళుతోందని ఆయన అన్నారు.

భారతదేశంలో ఎక్కువ మొత్తంలో ధాన్యం పండించిన రాష్ట్రం మన తెలంగాణకాగా , రాష్ట్రంలో అత్యధికంగా వరి ధాన్యం పండించిన జిల్లా నల్లగొండ అని తెలిపారు. కెసిఆర్ సమర్థవంతమైన నాయకత్వం వల్లనే ఏడున్నర సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రం వ్యవసాయం, పరిశ్రమలు, గ్రామీణాభివృధ్ది , ఐటిరంగంలో రాష్ట్రం అగ్రభాగాన దూసుకెళుతోందని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఏక కాలంలో పట్టణాలు , పల్లెల ప్రగతికి నూతన పంచాయతీరాజ్ , పురపాలక చట్టం రూపొందించి స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులకు విధులు నిర్దేశిస్తూ నిధులు మంజూరు చేస్తోందన్నారు. గ్రామాలను , పట్టణాలను పర్యవేక్షించేందుకు ఐఎఎస్ అధికారులను నియమించి పల్లెలను , పట్టణాల అభివృద్ధికి నెలనెల నిధులను విడుదల చేస్తోందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సవ్యంగా, క్రమపద్ధతిలో , ప్రణాళికాబద్ధంగా , వ్యూహంతో ముందుకు వెళుతోందన్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నెల క్రితం విడుదల చేసిన నివేదికలో భారత ఆర్థిక వ్యవస్థకు 4వ ఆర్థిక చోదక శక్తిగా తెలంగాణ రాష్ట్ర ం ఉన్నదని వెల్లడించిందని, ఇది మనందరికి గర్వకారణమన్నారు.

రాష్ట్రంలో అభివృధ్ది , సంక్షేమం జోడెద్దుల్లా పరుగులు పెడుతున్నట్లు తెలిపారు. వ్యవసాయానికి 24గంటల ఉచిత విద్యుత్‌ను రైతులకు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని అన్నారు. 200ల రూపాయలనుండి 2000రూపాయలకు ఆసరాపెన్షన్లు పెంచినట్లు, పేదింటి ఆడపిల్లల వివాహానికి ఒక లక్షా116 రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. కే్ందర ప్రభుత్వం ప్రకటించిన అవార్డులు రాష్ట్రంలో పల్లెలు, పట్టణాలు దక్కించుకున్నాయని అన్నారు. రాష్ట్రంలో ఏ ఒక్క గ్రామంలో ఫ్లోరోసిస్ లేదని , పార్లమెంటులో కేంద్రం ప్రకటించిందని , మిషన్ భగీరథ పథకం వల్లే ఫ్లోరైడ్ మహమ్మారి అంతం అయ్యిందని తెలిపారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మూడు మెడికల్ కాలేజీలను మంజూరు చేశామని , యాదాద్రి ఆలయం, యాదాద్రి పవర్ ప్లాంట్‌ను నిర్మిస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కిందన్నారు. 1800 కోట్ల రూపాయలతో యాదాద్రి లక్ష్మీనరసింస్వామి ఆలయాన్ని అత్యంత అద్భుతంగా నిర్మిస్తున్నామని తెలిపారు. 50వేల కోట్ల రూపాయలతో రైతు బంధు పథకం ద్వారా రైతులకు అందించిన ఘనత ముఖ్యమంత్రి కెసిఆర్‌కే చెందుతుందన్నారు.

రైతులు మరణిస్తే దేశంలో ఏ రాష్ట్రంలో లేని విదంగా రైతుబీ మా కింద ఆదుకుంటున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. ద్వితీయ శ్రేణి నగరాలలో కూడా ఐటి రంగాన్ని విస్తరించి ఐటి ఫలాలు సామాన్య ప్రజలకు అందించాలని ప్రబుత్వం ముందుకు పోతున్నదని తెలిపారు. టాస్క్ పేరిట నల్లగొండలోనే విద్యార్థులకు నైపుణ్య శిక్షణ అందించేలా సెంటర్ ఏర్పాటు చేయనున్నట్టు , ఇక్కడే వారికి అన్ని విధాల ప్రోత్సహకాలు అందించి , స్థానిక యువత పారిశ్రామిక వేత్తలుగా ఎదిగేలా శిక్షణనిస్తుందని అన్నారు. నూతన ఆవిష్కరణలు ప్రోత్సహించేందుకు హైద్రాబాద్‌లో ఐటి. హబ్ ఏర్పాటు చేసినట్లు నల్లగొండలో కూడా స్థానిక ఐటి.హబ్ కేంద్రం ఏర్పాటు చేసి ఇక్కడ యువత నూతన ఆవిష్కరణలు ప్రోత్సహించనున్నట్లు తెలిపారు. ఐటి హబ్ శంకుస్థాపనకు ముందే 1600 కొలువులు కల్పించేందుకు ఐటి కంపెనీలు ముందుకు వచ్చాయని వెళ్లడించారు. ఐటిహబ్ భవనం పూర్తి కావడానికి 16 నెలలు పడుతుందని , భవనం పూర్తి అయ్యేవరకు తాత్కాలికంగా ఏర్పాట్లు చేసి స్థానిక యువతకు అవకాశాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు.

రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి. జగదీశ్వర్‌రెడ్డి మాటాల్డుతూ అభివృధ్ది అంటే ఏంటో ఈ ఆరేళ్లలో చూసింది నల్లగొండ జిల్లా అని, సమైఖ్య పాలనలో నల్లగొండ జిల్లా ఫ్లోరైడ్‌తో నరకయాతన అనపుభవించిందని, మిషన్ భగీరథతో ఫ్లోరైడ్ మహమ్మారిని తరిమి కొట్టినట్లు తెలిపారు. దండు మల్కాపూర్‌లో గ్రీన్ ఇండస్ట్రీయల్ పార్కు ఏర్పాటు చేసి యాదాద్రి జిల్లాలో ఉపాధి అవకాశంలో కల్పించినట్లు , కెటిఆర్ దూరదృష్టితో రాష్ట్రంలో ఐటి రంగం అభివృధ్ధి చెందుతుందని , ద్వితీయ శ్రేణి నగరాలలో కూడా ఐటిని సాంకేతికంగా విస్తరించవచ్చని కెటిఆర్ నిరూపించారని అన్నారు. హైద్రాబాద్‌లో ట్రాఫిక్ కంట్రోల్ చేసి ట్రాఫిక్ నగరంగా చేసే అద్భుత సాంకేతిక పరిజానం కూడా రూపొందిస్తున్నారని అన్నారు. నల్లగొండ జిల్లాపై ముఖ్యమంత్రి కెసిఆర్‌కి ప్రత్యేకమైన ప్రేమ, ఆప్యాయత ఉన్నతి. నల్లగొండ పట్టణం ఇక సర్వాంగ సుందరీకరణ జరుగుతుందని అన్నారు. రహదారులు , భవనాలు , గృహ నిర్మాణ శాఖమంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ నల్లగొండ లో ఐటి హబ్ ఏర్పాటు చేయడగం శుభ సూచకమని, ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటిని విస్తరిస్తూ , స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు మంత్రి కెటిఆర్ కృషి చేస్తున్నారన్నారు. అన్ని జిల్లా కేంద్రాలలో ఐటి హబ్‌లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

తెలంగాణ రాక ముందు 56 వేల కోట్లు ఉన్న ఐటి ఎగుమతులు ఇవ్వాల లక్ష 45వేల కోట్లకు పెరిగినట్లు , ఇదిఅంతా కెటిఆర్ కృషి ఫలితమే అన్నారు. ఇవాళ డైరెక్టుగా 6 లక్షల మంది ఐటి రంగంలో ఉద్యోగాలు చేస్తున్నారని అన్నారు. టిఎస్ ఐపాస్ ద్వార 17వేల పరిశ్రమలు ఏర్పాటు చేసి 2లక్షల 25వేల కోట్ల పెట్టుబడులు పెట్టి 16 లక్షల మందికి యువతకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పించారని అన్నారు. ప్రభుత్వ రంగంలో క లక్షా 32 వేల మందికి ఉద్యోగాలు కల్పించిన ఘనత ముఖ్యమంత్రి కెసిఆర్‌కు దక్కుతుందని అన్నారు. దేశంలో ఏ రాష్ట్రం లో కూడా ఇన్ని ఉద్యోగాలు కల్పించలేదని స్పష్టం చేవారు. స్థానిక శాసన సభ్యులు కంచర్ల భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ నల్లగొండ పట్టణాన్ని అన్నివిదాలుగా అభివృధ్ధి చేస్తున్నట్టు తెలిపారు. నాగార్జున డిగ్రీ కాలేజ్ నూతన భవనాలకు 30కోట్లు మంజూరు చేసిన ముఖ్యమంత్రి కెసిఆర్‌కు రుణపడి ఉంటామని, పానగల్ ప్రాంతాన్ని గొప్ప పర్యాటక ప్రాంతంగా తీర్చిద్దినున్నట్లు తెలిపారు.

ఐటి హబ్ ఏర్పాటు ఓ చరిత్రాత్మకం , యువతకు ఉపాధి , ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో టిఎస్‌ఐఐసి చైర్మన్ గ్యాదరి బాలమల్లు, రాజ్య సభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, శాసన మండలి సభ్యులు టి. రవీందర్ రావు, , ఎంసి కోటిరెడ్డి, శానంపూడి సైదిరెడ్డి,జెడ్‌పి చైర్మన్ బండ నరేందర్‌రెడ్డి ,బొల్లం మల్లయ్య యాదవ్ ,ఎన్ బాస్కర్‌రావు,నోముల భగత్, మాజి ఎంఎల్‌సి పూల రవీందర్, మాజి శాసన సభ్యులు వేముల వీరేశం , కె. ప్రబాకర్‌ఱెడ్డి, రైతు బంధు సమితి అధ్యక్షులు రాంచంద్ర నాయక్, ఐటి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్‌పాటిల్, అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ, మున్సిపల్ చైర్మన్ మందడి సైదతిరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ పాల్గొన్నారు.

పట్టణంలో పాదయాత్ర చేసిన మంత్రులు

నల్లగొండ పట్టణంలో ఎన్‌టిఆర్ విగ్రహంనుండి క్లాక్ టవర్ , డిఇవో కార్యాలయం, దేవరకొండ రహదారులవెంబడి మంత్రులు పాదయాత్ర చేసి రహదారులు , స్థానిక సమస్యలపై ప్రజలతో మాట్లాడి తెలుసుకున్నారు. ఈ పాద యాత్రలో మంత్రులు కెటిఆర్, ప్రశాంత్‌రెడ్డి, జగదీశ్వర్‌రెడ్డి, పురపాలన, పట్టణాభివృధ్ది శాక ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్‌కుమార్, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ , అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ, ఎంపిలు, ఎంఎల్‌సిలు శాసన సభ్యులు పాల్గొన్నారు. శాసన సభ్యులు గాదరి కిషోర్ కుమార్‌ను పరామర్శించిన మంత్రులు తుంగతుర్తి శాసన సభ్యులు గాదరి కిషోర్ కుమార్‌ను నల్లగొండ పట్టణంలో ఆయన ఇంటివద్ద మంతి కెటిఆర్ , ప్రశాంత్‌రెడ్డి, జి. జగదీశ్ రెడ్డితో కలిసి పరామర్శించారు. ఇటీవల శాసన సభ్యులు గాదరి కిషోర్ కుమార్ తండ్రి గాదరి మారయ్య మరణించిన విషయం తెలిసిందే. గాదరి కిషోర్‌కుమార్, కుటుంబ సభ్యులను పరామర్శించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News